https://oktelugu.com/

ఉండవల్లి వ్యాఖ్యలు.. ఇరకాటంలో వైసీపీ నేతలు..!!

ఉండవల్లి అరుణ్ కుమార్ అనగానే అనువాదం బాగా చేస్తాడు.. తన వ్యాఖ్యాత బాగుంటుంది.. అనే పేరుంది. అంతే కాకుండా అధికార పక్షం చేసే తప్పులను కూడా లెక్కలతో సహా బయటపెడుతాడనే వాదన కూడా ఉంది. ప్రస్తతం ఆయన రెండో పనిని చేస్తున్నాడు. అంటే వైఎస్ జగన్ సర్కారు చేస్తున్న తప్పులను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏకి పారేస్తున్నాడు. Also Read: కొనసాగుతున్న టీపీసీసీ ‘పంచాయితీ’..! వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంపీగా పనిచేసిన ఉండవల్లి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 9, 2020 / 01:28 PM IST
    Follow us on

    ఉండవల్లి అరుణ్ కుమార్ అనగానే అనువాదం బాగా చేస్తాడు.. తన వ్యాఖ్యాత బాగుంటుంది.. అనే పేరుంది. అంతే కాకుండా అధికార పక్షం చేసే తప్పులను కూడా లెక్కలతో సహా బయటపెడుతాడనే వాదన కూడా ఉంది. ప్రస్తతం ఆయన రెండో పనిని చేస్తున్నాడు. అంటే వైఎస్ జగన్ సర్కారు చేస్తున్న తప్పులను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏకి పారేస్తున్నాడు.

    Also Read: కొనసాగుతున్న టీపీసీసీ ‘పంచాయితీ’..!

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంపీగా పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన కుమారుడు జగన్ కు మాత్రం ఎందుకంత వ్యతిరేకంగా మారాడో ఎవరికి అర్థం కావడం లేదు. అయితే జగన్ పై ప్రత్యక్షంగా విమర్శలు చేయకపోయినా ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడడంతో ఆ పార్టీ నాయకులు అయోమయానికి గురవుతున్నారు.

    వైఎస్ హయాంలో పనులు ప్రారంభించుకున్న పోలవరం ప్రాజెక్టుపై ఉండవల్లి అరుణుకుమార్ టార్గెట్ చేశారు. గతంలో టీడీపీ సర్కారు హయాలో పోలవరం విషయంలో తప్పలను చూపిన విధంగానే ఇప్పడు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోవడానికి ప్రభుత్వమే కారణమన్నట్లు వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ నాయకులకు మింగుడు పడడం లేదు. ఒక సందర్భంలో కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం చెప్పాలని ఇరుకున పెడుతున్నాడు. మొదట్లో ఉండవల్లిని లైట్ గా తీసుకున్న వైసీపీ నాయకులకు ఆ తరువాత ఉండవల్లి కంట్లో నలుసులాగా మారిపోయాడు.

    Also Read: వలంటీర్ల ఉద్యోగాల తొలగింపులో మర్మమేమిటి..?

    అయితే ఉండవల్లి వ్యాఖ్యలను పెద్ద మనసుతో స్వీకరించాలా..? లేదా ఆయనపై విమర్శలు చేయాలా..? అనేది వైసీపీ నాయకులకు అర్థం కావడం లేదు. ఓ వైపు జగన్ ను గౌరవిస్తున్నానని చెబుతూనే మరోవైపు ప్రభత్వంపై విమర్శలు చేయడంతో అయోమయానికి గురవుతున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో లెక్కలతో సహా మరీ బయటపెట్టి విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్