కరోనాతో రాష్ట్రాల ఆదాయం పడిపోయింది. ఆదాయం పెంచుకునేందుకు మార్గాలు వెతుకుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని ఇప్పటికే చాలా మంది సీఎంలు కోరారు. కానీ.. కేంద్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక్క పైసా విడుదల చేయలేదు. దీంతో ఈ జీఎస్టీ వ్యవహారంలో తెలంగాణ సీఎం ఓ అస్త్రం ప్రయోగించబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: మరో వివాదంలో ఇరుక్కున సీఎం జగన్?
జీఎస్టీ పరిహారం వ్యవహారంలో కేంద్రం అన్యాయం చేస్తుండడంతో కేసీఆర్ న్యాయ పోరాటం చేయాలని అనుకుంటున్నారట. కేంద్రం కూడా జీఎస్టీ సెస్‌ను దారి మళ్లించిందని అధికారికంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక స్పష్టం చేసింది. వాస్తవానికి ఆ నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలి . కానీ ఇవ్వలేదు. అదీకాక.. ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తోంది. న్యాయంగా రావాల్సిన సొమ్ము కావడంతో ఇవ్వాల్సిన తెలంగాణ సర్కార్ పట్టుబడుతోంది.
జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు జీఎస్టీ ఆదాయం తగ్గితే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ పరిహారం కోసం సెస్‌ను కూడా వసూలు చేస్తుంటారు. అయితే.. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలి రెండేళ్లలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం కన్నా ఎక్కువగా సెస్ వసూలయింది. ఇది దాదాపుగా రూ.47వేల కోట్లు ఉంది. ఈ మొత్తం ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంది. కానీ.. కేంద్రం ఇవ్వలేదు. యాక్ట్ ఆఫ్ గాడ్ పేరుతో నిర్మలా సీతారామన్ వాటిని ఇవ్వడానికి నిరాకరించారు. ఇలా చేయడం కేంద్రం జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని కేసీఆర్ అంటున్నారు.
Also Read: అలెర్ట్: మరో 24 గంటలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక
తాజాగా.. కాగ్ నివేదికలో ఈ నిధులను కేంద్రం ఇతర అవసరాలకు వాడినట్లుగా స్పష్టం చేసింది. ఇప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని కేసీఆర్ కేంద్రంపై కోర్టులో న్యాయపోరాటం చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా ఏకంగా కాగ్ స్పష్టంగా పేర్కొనడంతో కోర్టులోనూ వాదనలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కేసీఆర్‌తో పాటు బీజేపీయేతర అధికార పార్టీలన్నీ కేంద్రంపై పోరాటానికే సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. కేసీఆర్ వారందరినీ కూడగట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు సమాచారం.