https://oktelugu.com/

ఏపీకి షాకిచ్చేలా కేసీఆర్ భారీ స్టెప్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాల్వలపై తెలంగాణ కేబినెట్ నిరసన తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో తెలంగాణ రాష్ర్ట మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్జీటీ, కేంద్రం ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ బేఖాతరు చేసిందని వాపోయారు. కేంద్రం వైఖరితో రాష్ర్ట ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి నెలకొందని కేబినెట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కృష్ణానదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. జోగులాంబ గద్వాల […]

Written By: , Updated On : June 20, 2021 / 10:48 AM IST
Follow us on

KCRఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాల్వలపై తెలంగాణ కేబినెట్ నిరసన తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో తెలంగాణ రాష్ర్ట మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్జీటీ, కేంద్రం ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ బేఖాతరు చేసిందని వాపోయారు.

కేంద్రం వైఖరితో రాష్ర్ట ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి నెలకొందని కేబినెట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కృష్ణానదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. జోగులాంబ గద్వాల వనపర్తి జిల్లాల మధ్య కృష్ణానదిపై అలంపూర్ వద్ద గుమ్మడం, గొందిమల్ల, వెటూరు, పెద్దమారూరు గ్రామాల పరిధిలో ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించింది.

జోగులాంబ ఆనకట్ట ద్వారా 60-70 టీఎంసీల వరద నీటిని పైప్ లైన్ ద్వారా తరలించాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల జలాశయానికి నీటిని ఎత్తిపోసి పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద భీమా వరద కాల్వను నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో ఎత్తివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. 20 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా అన్ లాక్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. కరోనా తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో లాక్ డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తివేసేందుకు నిర్ణయించారు. దీంతో అన్ని రాష్ర్టాల మాదిరి తెలంగాణలో కూడా లాక్ డౌన్ ప్రక్రియ ముగిసింది. కానీ ఇంకా మూడో వేవ్ పొంచి ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.