https://oktelugu.com/

ఓడగొట్టారని హైదరాబాదీలకు వరదసాయం ఇవ్వవా కేసిఆర్ సార్?

జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ సార్ ఆర్భాటంగా ప్రకటించారు.  వరదల్లో మునిగిన ప్రతి ఇంటికి రూ.10వేల సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కొంతమందికి పంచాడుకూడా.. కానీ ఎన్నికల కోడ్ తో వరద సాయం ఆగిపోయింది. అయితే ఎన్నికలు ముగియగానే ప్రజలకు వరద సాయం పంపిణీ చేస్తానని మాట ఇచ్చారు. శరామాములుగానే దాన్ని ఇప్పుడు మరిచిపోయారు. Also Read: స్పృహ తప్పిన అఖిల.. ఇంకా పరారీలోనే భార్గవ్‌ హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసాయి. 100 ఏళ్ల […]

Written By:
  • NARESH
  • , Updated On : January 7, 2021 / 10:04 AM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ సార్ ఆర్భాటంగా ప్రకటించారు.  వరదల్లో మునిగిన ప్రతి ఇంటికి రూ.10వేల సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కొంతమందికి పంచాడుకూడా.. కానీ ఎన్నికల కోడ్ తో వరద సాయం ఆగిపోయింది. అయితే ఎన్నికలు ముగియగానే ప్రజలకు వరద సాయం పంపిణీ చేస్తానని మాట ఇచ్చారు. శరామాములుగానే దాన్ని ఇప్పుడు మరిచిపోయారు.

    Also Read: స్పృహ తప్పిన అఖిల.. ఇంకా పరారీలోనే భార్గవ్‌

    హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసాయి. 100 ఏళ్ల రాని వరదలు సంభవించి రెండు నెలలు దాటింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మైలేజీని పొందేలా ప్లాన్ చేసింది. వరదల నుంచి ఉపశమనం కలిగించడం కోసం రూ .10,000 నగదును పంపిణీ చేస్తామని ప్రకటించింది. తద్వారా బాధిత ప్రాంతాల్లోని ప్రజలను ప్రసన్నం చేసుకోవాలనుకుంది.

    అయితే ఎన్నికల ప్రకటన రావడం.. కొందరు కోర్టుకు ఎక్కడం.. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ వరదసాయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను నిలిపివేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన డిసెంబర్ 6 తర్వాత రూ .10,000 పంపిణీని తిరిగి ప్రారంభిస్తామని నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేసిఆర్ హామీ ఇచ్చారు.

    అయితే ఆ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరువాత ఈ నగదు పంపిణీపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం విశేషం. డిసెంబర్ 7 నుంచి ఈసాయాన్ని పంపిణీని తిరిగి ప్రారంభించామని, ఆ డబ్బును లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తున్నామని ప్రకటించిన జీహెచ్‌ఎంసీ అధికారులు కొద్ది రోజుల తర్వాత ప్రక్రియను నిలిపేశారు.

    Also Read: కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్.. కొనసాగుతున్న వేట

    నగదు పంపిణీ ఏమైందని తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఏఐసిసి అధికార ప్రతినిధి శ్రావన్ దాసోజు మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి ఎన్నికలు పూర్తయి ఒక నెల గడిచినా, వరద సాయం డబ్బు పంపిణీ చేసే చర్యలేవీ లేవని కేసీఆర్ ను సూటిగా అడిగారు. హైదరాబాద్‌లోని లబ్ధిదారులకు వరద సహాయ నిధుల పంపిణీని పూర్తి చేయాలని.. ఎన్నికల్లో ఓడగొట్టారని వారికి ఇవ్వకపోవడం న్యాయం కాదని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

    నెలరోజులు దాటినా బాధితులు ఇంకా తమ వంతు కోసం ఎంతసేపు వేచి ఉండాలని ప్రశ్నించాడు. కేసీఆర్ చేసే సాయం ఆయన ఇంట్లోంచి చేసేది కాదని.. సిఎం రిలీఫ్ ఫండ్ (సిఎంఆర్ఎఫ్) ప్రజా ధనమని.. కేసిఆర్ టిఆర్ఎస్ నాయకుల ప్రైవేట్ డబ్బు కాదని శ్రావణ్ మండిపడ్డారు. అందువల్ల, అలాంటి నిధులను ఖర్చు చేయడంలో పారదర్శకత జవాబుదారీతనం ఉండాలని గులాబీ సర్కార్ కు సూచించారు..

    ఇలా కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ మరిచిపోయినా కానీ.. ఇంకా వరద బాధితులు వరదసాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. వారికి సాయం అందుతుందా? లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ గెలిస్తే ఈపాటికి వారికి సాయం అందేది. కానీ ఓడిపోవడం.. మెజార్టీ రాకపోవడంతో హైదరాబాదీలకు సాయం అందని ద్రాక్షగా మారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్