
ఏపీలో జగన్ ప్రభుత్వం ఎస్‌ఈసీ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ వివాదం మళ్లీ ముదురుతోంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ సిద్ధమవుతుంటే.. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని కుదరదని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించినా.. రెండుసార్లు వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఎస్ఈసీ గవర్నర్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ప్రభుత్వ నుంచి సహకారం లేదని పరిస్థితిని వివరించారు.
Also Read: టాప్ సీక్రెట్: జమిలీ ఎన్నికలని పవన్‌కు ఎలా తెలుసు?
కొందరు మంత్రులపైనా నిమ్మగడ్డ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎస్ఈసీపై కాలు దువ్వుతున్న మంత్రులను కట్టడి చేయాలని కోరారట. ఇందులో భాగంగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అధికార ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారట. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై క్లిప్పింగ్స్‌ను గవర్నర్‌కు అందజేశారట. ముఖ్యంగా మంత్రి నాని అసభ్యపదజాలం వినియోగించడమే కాకుండా.. ఎన్నికల నిర్వహణపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎస్ఈసీ ఫిర్యాదులో పేర్కొన్నారట.
ఎన్నికల నిర్వహణ కమిషన్ విధి అని.. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారట. ఉద్యోగులను ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారట. ఇవి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలని ఫిర్యాదులో ప్రస్తావించారట. కొడాలి నానిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారట.
Also Read: సుప్రీంకోర్టులో సీఎం జగన్ కు గొప్ప ఊరట!
ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో మరోసారి ఎస్‌ఈసీ- ప్రభుత్వం మధ్య మాత్రం యుద్ధం మొదలైనట్లే కనిపిస్తోంది. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని.. ఇక్కడ ఎందుకు నిర్వహించరాదంటూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగైనా నిర్వహించాల్సిందేనంటూ బెట్టు చేస్తున్నారు. మరోవైపు సర్కార్ మాత్రం మరికొద్ది రోజుల్లో ఎన్నికల కమిషనర్ పదవీ విరమణ చేస్తుండడంతో ఆ లోపు ఎన్నికలు నిర్వహించేది లేదంటూ ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీరివురి మధ్య ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి మరి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్