https://oktelugu.com/

జల్లికట్టులో జూనియర్ ఎన్టీఆర్.. పోట్లగిత్తలా పరిగెత్తాడే?

జల్లికట్టు.. పోట్లగిత్తలను బరిలోకి దింపి వాటిని మేనేజ్ చేసే వాడే మొనగాడు. అయితే ఆ పోట్లగిత్తెలకు పలు పేర్లు కూడా పెడుతుంటారు. మాములుగా దేవతల పేర్లతో బరిలో దించుతారు. కానీ ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ నే బరిలోకి దించడం విశేషం. ఇప్పుడా ఫొటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. Also Read:  రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.36,000 పొందే ఛాన్స్..? అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న […]

Written By:
  • NARESH
  • , Updated On : January 13, 2021 / 07:06 PM IST
    Follow us on

    జల్లికట్టు.. పోట్లగిత్తలను బరిలోకి దింపి వాటిని మేనేజ్ చేసే వాడే మొనగాడు. అయితే ఆ పోట్లగిత్తెలకు పలు పేర్లు కూడా పెడుతుంటారు. మాములుగా దేవతల పేర్లతో బరిలో దించుతారు. కానీ ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ నే బరిలోకి దించడం విశేషం. ఇప్పుడా ఫొటోలు వీడియోలు వైరల్ అయ్యాయి.

    Also Read:  రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.36,000 పొందే ఛాన్స్..?

    అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ చిత్తూరు జిల్లాలో నిర్వహించిన జల్లికట్టుకు వచ్చాడనుకుంటే పొరపాటే. ఆయన స్థానంలో ఆయన ఫొటోలు వచ్చాయి.

    ఈసారి చిత్తూరు జిల్లాలో జరిగిన జల్లికట్టు పోటీలలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో తమ పౌరుషాన్ని అభిమానులు చూపెట్టారు.చామచంద్రాపురం మండలం అనుప్పల్లిలో జరిగిన వేడుకల్లో పోట్ల గిత్తలను అందంగా ముస్తాబు చేసిన తారక్ ఫ్యాన్స్.. ఆ గిత్తలకు ఎన్టీఆర్ ఫొటోలను పెట్టి సందడి చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    ఎన్టీఆర్ పోట్ల గిత్తెలు బరిలో దూసుకుపోతుంటే వాటిని ఆపడం ఎవరి తరం కాలేదు. మా హీరో అంటే అంతే అని తారక్ ఫ్యాన్స్ తొడలు కొడుతూ హల్ చల్ చేశారు. ఇప్పటిదాకా ఇలా ఏ హీరోకు కూడా అందలం దక్కలేదు. మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ కు ఇలాంటి ఘనత దక్కడం విశేషం.

    Also Read: జర్నలిస్టులు ఏం పాపం చేశారు జగన్?

    చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ వింత ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ జల్లికట్టు ఆటను చూడడానికి వేలాది మంది యువత , జనం తరలివచ్చారు. పోలీసుల ఆంక్షలను తోసిరాజని జల్లికట్టులో అందరూ పాల్గొని సందడి చేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్