మన దేశంలో ఎక్కువ సంఖ్యలో స్మార్ట్ ఫోన్ యూజర్లు రెడ్ మీ మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారనే సంగతి తెలిసిందే. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో రెడ్ మీ ఫోన్లు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది ఈ ఫోన్లను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే షియోమీ కంపెనీ రెడ్ మీ ఫోన్లు వాడే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గతేడాది విడుదలైన రెడ్ మీ 9 ప్రైమ్ యుజర్లకు ఎంఐయుఐ 12 అప్‌డేట్ ను తెచ్చింది.
ప్రస్తుతం రెడ్ మీ 9 ప్రైమ్ యూజర్లకు ఆ ఫోన్లు ఎంఐయుఐ 11తో పని చేస్తున్నాయి. ఇప్పటికే అప్ డేట్ అందుబాటులోకి రాగా రెడ్ మీ 9 ప్రైమ్ యూజర్లు సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. అప్ డేట్ తీసుకురావడం పట్ల యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంఐయుఐ 12.0.1.0.qjcinxm వెర్షన్ నంబర్‌తో ఈ అప్ డేట్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
మొదట చైనాలోని రెడ్‌మీ 9 ప్రైమ్ ఫోన్లకు ఈ అప్ డేట్ అందుబాటులోకి రాగా ఈ అప్ డేట్ సైజు 600 ఎంబీ వరకు ఉంటుందని సమాచారం. 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో ఈ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. రెడ్ మీ తెచ్చిన ఈ కొత్త అప్ డేట్ 2020 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ తో రానుందని తెలుస్తోంది. రెడ్ మీ 9 ప్రైమ్ ఫోన్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా భవిష్యత్తులో ఇతర మొబైల్ ఫోన్లకు అందుబాటులోకి రానుంది.
అప్ డేట్లను కంపెనీలు మొబైల్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా యూజర్లకు గతంతో పోలిస్తే మెరుగైన ఫీచర్లు లభిస్తున్నాయి. అప్ డేట్లను తీసుకురావడం ద్వారా యూజర్లకు కొత్త స్మార్ట్ ఫోన్ లో ఏ విధంగా అందుబాటులో ఉంటాయో అదే విధంగా ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి.