
దేశీయ టెలీకాం దిగ్గజం జియో వినియోగదారులకు ప్రయోజనం చేకూరే విధంగా కొత్తకొత్త రీచార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తెస్తోంది. దేశంలో దాదాపు 30 కోట్ల మంది యూజర్లు జియోను వినియోగిస్తున్నారు. జియో యూజర్లను ఆకట్టుకునేందుకు ఏడాది పాటు కాలపరిమితి ఉండే 3,499 ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 3జీబీ డేటాను పొందే అవకాశం అయితే ఉంటుంది.
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి 3 జీబీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు పడిపోవడం జరుగుతుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వాళ్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే జియో యాప్స్‌ను వినియోగించుకోవడంతో పాటు డిస్నీ + హాట్ స్టార్ వీఐపీ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందే అవకాశం ఉంటుంది.
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యురిటీ, జియో క్లౌడ్ ప్రయోజనాలను పొందవచ్చు. 999 రూపాయల ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 జీబీ డేటాను 84 రోజులు, రూ.401 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 28 రోజుల పాటు 90 జీబీ డేటాను పొందే అవకాశం ఉంటుంది. వీరికి కూడా డిస్నీ+ హాట్ స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా లభిస్తుంది.
జియో రాకతో దేశంతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. 4జీ సేవలను అత్యంత తక్కువ ధరకు అందిచండంతో వినియోగదారులు జియో వచ్చిన తర్వాత డేటా వాడకం ఎక్కువైంది. ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ ప్లాన్లను జియో సవరిస్తూ ఉండటం గమనార్హం.