
ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కూరగాయలు సాగు చేసేవాళ్ల సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. అయితే ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులకు లాభాలు తగ్గుతున్నాయి. తక్కువ పెట్టుబడితో కాలీఫ్లవర్ పంటను సాగు చేయడం ద్వారా రైతులు ఎక్కువ లాభాలను పొందవచ్చు. సాధారణంగా చల్లటి వాతావరణంలో క్యాలీ ప్లవర్ ను పండించడం జరుగుతుంది. కాలీఫ్లవర్ మెరుగైన రకాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి.
కాలీఫ్లవర్ మెరుగైన రకాల వల్ల రెండో సీజన్ లో కూడా ఈ పంటను పండించడం సాధ్యమవుతుంది. కాలీఫ్లవర్ ప్రారంభ దశలో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ సరఫరా పెరిగే కొద్దీ ధర తగ్గుతుంది. అయితే వ్యవసాయ శాస్త్రవేత్తలు జూన్ జులై నెలలలో కూడా పండించే కొన్ని మెరుగైన రకాలను అభివృద్ధి చేశారు. ఈ సమయంలో కాలీఫ్లవర్ మార్కెట్లో అందుబాటులో ఉండదు కాబట్టి సాగు చేసి మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చు.
పూసా మేఘనా, పూసా అశ్విని, పూసా కార్తీక్, పూసా కార్తీక్ హైబ్రిడ్ లను జూన్ జులై నెలలలో విత్తుతారని అక్టోబర్ నాటికి పంట చేతికి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రకాల సాగు కొరకు పొలం నీటితో నిండిపోకూడదు. పురుగులు సమస్యలు ఉన్న పొలంలో కాలీఫ్లవర్ ను విత్తకూడదు. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు 100 కిలోల ఆవు పేడలో ఒక కిలో టైకోడెర్మాను కలిపి 7 నుంచి 8 రోజులు ఉంచాలి.
సమయానికి కలుపు తీయాలని కీటకాలు లేదా వ్యాధి సోకితే స్ప్రే చేయాలని ప్రారంభ కాలీఫ్లవర్ మొలకలు 40 – 45 రోజుల్లో సిద్ధమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడంలో కాలీఫ్లవర్ ఉపయోగపడుతుందని సూచనలు చేస్తున్నారు.