https://oktelugu.com/

వ్యవసాయ చట్టాలపై జేపీ మాట.. వైరల్

దేశ పాలన రంగాన్ని అవపోసన పట్టిన ఐఏఎస్ ఆయన.. దేశంలోనే అత్యున్నత సర్వీసుల్లో చేసి వైదొలిగి ప్రజా సేవ కోసం కదిలిన ఓ ఉన్నతాధికారి ఆయన.. ప్రజల కోసం రాజకీయ పార్టీని ప్రారంభించాడు. నీతి, నిజాయితీ రాజకీయాల కోసం పోరాడాడు. ఆయనే లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ.. ఈ రోజుల్లో డబ్బులు, మద్యం పంచకుండా.. అలివి కానీ హామీలు ఇవ్వకుండా ప్రజలకు మేలు చేసేలా రాజకీయాలు చేద్దామనుకున్న ఈయన పాలిటిక్స్ లో సక్సెస్ కాలేకపోవచ్చు. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2020 12:24 pm
    Follow us on

    Jayaprakash Narayana

    దేశ పాలన రంగాన్ని అవపోసన పట్టిన ఐఏఎస్ ఆయన.. దేశంలోనే అత్యున్నత సర్వీసుల్లో చేసి వైదొలిగి ప్రజా సేవ కోసం కదిలిన ఓ ఉన్నతాధికారి ఆయన.. ప్రజల కోసం రాజకీయ పార్టీని ప్రారంభించాడు. నీతి, నిజాయితీ రాజకీయాల కోసం పోరాడాడు. ఆయనే లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ.. ఈ రోజుల్లో డబ్బులు, మద్యం పంచకుండా.. అలివి కానీ హామీలు ఇవ్వకుండా ప్రజలకు మేలు చేసేలా రాజకీయాలు చేద్దామనుకున్న ఈయన పాలిటిక్స్ లో సక్సెస్ కాలేకపోవచ్చు. కానీ ఆయన మాట ఒక రామబాణం.. ఆయన చెప్పేవి నిజాలు. స్వార్థపూరిత రాజకీయాలకు దూరంగా ఉండే లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తాజాగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై హాట్ కామెంట్స్ చేశారు.

    Also Read: అయోమయంలో వరద బాధితులు.. పరిహారం ఇస్తారా.. ఇవ్వారా?

    దేశంలో ఇప్పుడు బీజేపీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు రోడ్డెక్కి రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. వీరికి మద్దతుగా దేశంలోని 26 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. కేంద్రంలోని బీజేపీని నిలదీస్తున్నారు. కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే మోడీ సర్కార్ ఈ చట్టాలు చేసిందని విమర్శిస్తున్నారు.

    మరోవైపు బీజేపీ మాత్రం కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు లాభం చేకూరుతుందని.. మంచి మద్దతు ధర వస్తుందని.. రేటు డిమాండ్ వస్తుందని.. పాత చట్టాలతోనే రైతులకు నష్టం అంటూ వాదిస్తోంది.

    అయితే ప్రస్తుతం రాజకీయాల్లో మేధావి వర్గం మాత్రం బీజేపీ కొత్త చట్టాలతో లాభం అంటూ రైతులకు పిలుపునిస్తోంది. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ సైతం ఇదే మాట అనడం వైరల్ గా మారింది.

    Also Read: మోడీపై కేసీఆర్ పగ.. భారత్ బంద్ లో టీఆర్ఎస్ హోరు

    కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలు రైతులకు మేలు చేసేవే అని జయప్రకాష్ నారాయణ అన్నారు. స్వార్థంతోనే రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని జేపీ అభిప్రాయపడ్డారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని.. వారి అపోహలు తీర్చితే అంతకంటే మంచి చట్టాలు ఉండవని హితవు పలికారు. రైతులు తమకు ఏది మంచిదో అర్థం చేసుకోవాలన్నారు. కేంద్రం కూడా అందరితో చర్చించి ముందుకెళ్లాలని సూచించారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్