‘మావిచిగురు’, ‘శుభలగ్నం’ లాంటి సినిమాల్లో ఆయనను చూస్తే తమ భర్త ఇలా ఉంటే బాగుండు అని కొందరు మహిళలు అనుకున్నారు.. ‘అంత:పురం’ సినిమాలో యాక్షన్ చూసి ఈ హీరోతో ఓ సినిమా తీయాలని అనుకునేవారు.. ‘అల్లుడుగారు వచ్చారు’ సినిమా చూసి ఇలాంటి అల్లుడు మాకు రావాలని కోరుకున్నారు. ఇలా రకరకాలుగా.. విభిన్న పాత్రలో పోషించి మెప్పించిన జగపతి బాబు తెర ముందు యాక్టివ్‌గా కనిపించినా తెరవెనుక అయనకెన్నో కష్టాలున్నాయని తెలుసు. ఆయన హీరో కెరీర్ ముగిసిపోయాక అప్పులపాలయ్యారు. అయితే ప్రస్తుతం కష్టాల బారి నుంచి కోలుకుంటున్నారు. రీఎంట్రీలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి దక్షిణ భారత్ లోనే బిజీ నటుడిగా జగపతిబాబు మారాడు.
ఈ నేపథ్యంలో జగ్గుబాయ్ తన గురించి సంచలన విషయాన్ని బయటపెట్టాడు. తనపై బయోపిక్ వస్తున్న విషయం చాలా సంతోషకరమన్నారు. అయితే ఎప్పుడో టీవీ సిరియల్స్‌లోకి వెళ్దామనుకున్నానని, ఇప్పుడు తన జీవిథ గాధ ఆధారంగా బుల్లితెరపై రావడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను బయటపెట్టారు.
‘2012లో సినిమాల్లో అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయా. అప్పుడు దాదాపు 3 కోట్ల రూపాయల అప్పు తేలింది. ఇక చేసేదేమీ లేక ఇల్లు అమ్ముకొని అప్పు తీర్చాలనుకున్నాను. కానీ అదే తరుణంలో వచ్చిన అవకాశాలు నన్ను కష్టాల నుంచి గట్టెక్కించాయి. ఆ సమయంలో అవకాశం వస్తే సీరియల్స్‌లోనైనా నటించేందుకు సిద్ధమయ్యా.. కానీ అక్కడ కూడా ప్రతికూల వాతావరణమే ఏర్పడింది. ఏదేతైనేం కాలాన్ని నమ్ముకున్న నాకు ఆ కాలమే తోడుగా.. అండగా నిలిచింది.’ అని వివరించారు.
తాను తీవ్ర అప్పుల్లో ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు రూ.50 లక్షలు ఇచ్చారని జగపతి బాబు గుర్తు చేసుకున్నారు… వడ్డీ కూడా వద్దన్నారు. ఆయన తనకు అవసరం ఉంది ఇవ్వుమనగానే అప్పు చేసి తిరిగి 50 లక్షలు వెంటనే తిరిగిచ్చేశా..అంటూ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు పలు సినిమాల్లో జగ్గుబాయి నటిస్తున్నాడు. పలు బయోపిక్ లతో టీవీల్లో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.. ప్రముఖ ఛానల్ ఆయన స్టోరీని పూర్తిగా షూటింగ్ చేసి ఎపిసోడ్ వైజ్‌గా ప్రసారం చేయనుంది.