సీఎం జగన్ ఒక సీరియస్ ఆరోపణ చేశారు. సుప్రీం కోర్టు జడ్జిపై ఫిర్యాదు చేస్తూ చీఫ్ జస్టిస్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో చేసిన ఆరోపణలపై చీఫ్ జస్టిస్ విచారణ జరపాలి. నిజమని తేలితే ఆ జడ్జిపై అభిశంసనకు పార్లమెంట్ ను కోరవచ్చు. ఒకవేళ జగన్ చేసిన ఆరోపణలు తప్పని తేలితే అతడి కోర్టు ధిక్కరణ కింద చర్య తీసుకోవచ్చు. కానీ ఇవేవీ తెలియకుండా దేశంలోని న్యాయవాదులు, బార్ అసోసియేషన్లు, రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోవడమే ఇక్కడ విచిత్రంగా కనిపిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: జగన్ లేఖ: జడ్జీలపై నాటి సీఎంల లేఖలు.. ఏం జరిగిందంటే?
ఓ సుప్రీం కోర్టు జడ్జిపై ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ ప్రకంపనలు న్యాయవ్యవస్థలో చర్చనీయాంశం అవుతున్నాయి. జాతీయ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. సీఎం జగన్ రాసిన లేఖపై దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల బార్ అసోసియేషన్లన్నీ స్పందిస్తున్నాయి. కొందరు అనుకూలంగా మాట్లాడుతుంటే.. కొందరు జగన్ లేఖను తప్పు పడుతున్నారు. దీనిపై ఇప్పుడు పెద్ద రచ్చే సాగుతోంది. కొందరు న్యాయవాదులైతే సుప్రీం కోర్టు పిల్ దాఖలు చేసి జగన్ మీద చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజాగా సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ కూడా ఘాటుగా జగన్ లేఖను ఖండించింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ ధవే అయితే లేఖలో ఏముందో చూడకుండా జగన్ ది తప్పు అని ఎలా నిర్ధారిస్తారని అన్నట్టు వార్తలు వచ్చాయి. లేఖపై విచారణ జరిగితే తప్పు జగన్ దా? లేక సదురు ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జిదా అన్నది తేలుతుంది కదా అన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఇలాంటి వాటిని విచారణ జరిపాక చర్య తీసుకుంటే ఇలా ఎవరూ చేయరని ఆయన అంటున్నట్టు తెలిసింది.
Also Read: టీడీపీకి గడ్డుకాలం లోకేశ్‌తోనేనా..?
బార్ అసోసియేషన్లలోని కొంతమంది వ్యక్తి భజన చేస్తున్నారా? అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆరోపణలు ఏమిటి అనేది విచారించకుండా ముందుగానే జడ్జిమెంట్ ఇవ్వటం న్యాయవ్యవస్థకే విరుద్ధమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొందరు జగన్ కు, మరికొందరు సుప్రీం కోర్టుకు వత్తాసు పలకడం కంటే విచారణ చేయిస్తే తప్పు ఎవరిదని తెలుస్తుంది కదా అని పలువురు సూచిస్తున్నారు. ప్రతి రోజు కోర్టులో దీనిమీద వాదించే న్యాయవాదులు విచారణ లేకుండానే ఇలా జగన్ ది తప్పు.. లేదా సుప్రీం కోర్టు జడ్జిది తప్పు అనడం ఎంతవరకు కరెక్ట్ అని హితవు పలుకుతున్నారు.. వీరి వాదనలు చూస్తుంటే ఇది పంచాయతీ పెద్దలకు వీళ్లకు తేడా లేదా? అని పలువురు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.