జగన్ వ్యూహం ఎంతటి పదునైందో మరోసారి రుజువైంది. న్యాయ వ్యవస్థతో ఢీకొడుతున్నప్పడు జగన్ వేస్తున్న అంచనా ఇప్పడు నిజమవుతోంది. సుప్రీం కోర్టులో జగన్ కు అనుకూలంగా పరిణామాలు జరుగుతుండడంతో ఆయన అనుకున్నది నెరవేరుతుందనేది తెలుస్తోంది. సాక్షాత్తూ సుప్రీం కోర్టు అటార్నీ జనరల్ సైతం జగన్ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోలేమని చెప్పడంతో జగన్ ముందుచూపుతో ఎలాంటి ప్రణాళిక రచించాడో అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాను రాసిన లేఖపై ఎలాంటి స్పందనలు వస్తాయో ముందుగానే ఊహించి ఏపీ సీఎం అడుగులు ముందుకు వేశారు. ఇప్పుడు జగన్ వేసిన అడుగులు ఎంతటి వ్యూహాత్మకమో ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేయడంతో అర్థమవుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తితోపాటు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల తీరుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేకు లేఖ రాయడం అప్పట్లో సంచలనమైంది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ సుప్రీంజడ్జి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రభావితం చేస్తున్నారని ఈ లేఖలో జగన్ ప్రస్తావించారు. రాజధాని కుంభకోణంతో పాటు రాష్ట్రంలో హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపై జగన్ సుప్రీంకు రాసిన లేఖలో తెలిపారు. అంతేకాకుండా ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ లేఖపై తగు చర్యలు తీసుకోవాలని, ఏదీ సముచితమో అలాంటి తగు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. దీనిపై దేశవ్యాప్తంగా అనేక స్పందనలు వచ్చాయి. దేశస్థాయిలో ఉన్న ప్రముఖ న్యాయవాదులు జగన్ కు మద్దతు తెలిపారు. వారు సైతం జగన్ రాసిన లేఖపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక రెండోవర్గం సుప్రీం జడ్జిపై ఫిర్యాదు చేయడంపై జగన్ ను విమర్శించారు. విమర్శించిన వారు తక్కువే అయినా ఇలాంటి స్పందనలు కూడా వస్తాయని జగన్ ముందుగానే ఊహించారు. అందుకే జగన్ ముందుగానే ఊహించిన ప్రకారంగా వ్యూహంతో వెళుతుండడంతో ఆయనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా న్యాయవాది అశ్విని కుమార్, సీఎం జగన్ పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కు లేఖ రాశారు.
Also Read: లోకేష్ కు అస్త్రంలా మారిన పోలవరం
సాధారణంగా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటే అయితే అటార్నీ జనరల్ లేదా కోర్టు సుమోటోగా తీసుకొని విచారణ ప్రారంభించాలి. లేదా పబ్లిక్ ఎంట్రెస్ట్ పిల్ వేయాలి. ఈ మూడు మార్గాలతోనే కోర్టు ధిక్కరణ చర్యలకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే పిల్ వేసినా కోర్టు స్వీకరించలేదు. ఇక న్యాయవాది అశ్వినికుమార్ ఉపాధ్యాయ అటార్నీ జనరల్ వేణుగోపాల్ కు లేఖ రాయడంతో ఇది కోర్టు పరిధిలో ఉన్నందున చర్యలు చేపట్టలేనని స్పష్టం చేశారు.
అంటే జగన్ ముందుగానే కంటెమ్ట్ కు అవకాశం లేకుండా ఈ లేఖను రాశాడని తెలుస్తోంది. ఒకవేళ న్యాయమూర్తులపై రాసిన లేఖ బయటపెట్టకపోవడంతో ఈ లేఖపై అంతర్గత చర్యలు తీసుకునేవారేమో. దీంతో జగన్ ఈ లేఖ రహస్యాన్ని ప్రజల్లో పెట్టి ఆ తరువాత ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో ముందుగానే ఊహించారు. న్యాయమూర్తులపై, లేఖలపై విచారణ చేపట్టకుంటే న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఉండే పరిస్థితి లేదు. అందుకే అటార్నీ జనరల్ ఆ చర్యలు తీసుకోలేని చెప్పేశారు.
Also Read: వైరల్: వైసీపీ ఎమ్మెల్యే ఆడియో టేప్ లీక్ కలకలం
అంతేకాకుండా ఇప్పటి వరకు లేఖలపై కోర్టు సుమోటాగా తీసుకొని విచారించిన దాఖలాలు లేవు. ఒకవేళ జగన్ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలంటే అంతకంటే ముందు జస్టిస్ రమణపైన, ఏపీ కోర్టు న్యాయవాదులపైన విచారణ చేయాలి. ఇలాంటి పరిణామాలను జగన్ ముందుగానే ఊహించి వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది.