
ఆంధ్రప్రదేశ్ కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. దూలం నాగేశ్వర రావుకు స్వల్ప లక్షణాలు ఉండడంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు ఆరోగ్య పరిరక్షణలో ఉండాలని, అవసరమైతే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా ఏపీలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది.