మీడియా అనే సరికి దేశంలో పట్టపగ్గాలు లేకుండా రాసేస్తున్నారు. ఈ మధ్య కోర్టుల తీర్పులు కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రావడం.. వాటిపై రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించడం.. మీడియా వాటిని హైలెట్ చేయడం సాగుతోంది. ఏపీ సీఎం జగన్ అక్కడి న్యాయమూర్తులు, ఓ సుప్రీం కోర్టు జడ్జిపై రాసిన లేఖ ఎంత కలకలం రేపిందో చూశాం. దీనిపై జగన్ ను చాలా మంది నిందించారు. కొందరు సపోర్టు చేశారు.
Also Read: అఖిలప్రియ ఏపీలో అరెస్ట్ అయ్యింటే.. కథ వేరేగుండేది
అయితే తాజాగా సీఎం జగన్ రాసిన లేఖపై సదురు సుప్రీంకోర్టు జడ్జిని ఏకంగా చీఫ్ జస్టిస్ వివరణ కోరారన్న వార్తలు జాతీయ మీడియాలో గుప్పుమన్నాయి. ఏపీలోని కొన్ని మీడియాలు దీన్ని యాథతథంగా ప్రచురించాయి. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు స్పందించింది. ఇలాంటి వార్తలపై మండిపడింది.
సుప్రీంకోర్టు పరిధిలో అంతర్గత వ్యవహారాలన్నీ అత్యంత సీక్రెట్ గా సాగుతాయని.. ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం కాబోవంటూ సుప్రీంకోర్టు తెలిపింది. తమ కథనాలకు విశ్వసనీయతను ఆపాదించడానికి సుప్రీంను కోట్ చేయడం మానుకోవాలని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంలో జరిగేదంతా రహస్యంగానే ఉంటుందని.. దాన్ని మీడియా వెల్లడించడం జరగదని స్పష్టం చేసింది.
Also Read: జగన్ ను లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్
ఇక జగన్ లేఖపై చీఫ్ జస్టిస్ వివరణ కోరారన్న వార్తలను సైతం సుప్రీంకోర్టు ఖండించింది. సుప్రీ జడ్జిని వివరణ కోరారంటూ వచ్చిన వార్తలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సదురు వార్తల్లో నేరుగా సుప్రీంకోర్టునే ప్రస్తావిస్తూ కథనాలు సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో అంతర్గతంగా సాగే ఈ ప్రక్రియను మీడియా ఎలా రిపోర్టింగ్ చేస్తోందని సుప్రీం ప్రశ్నించింది.
సున్నితమైన విషయాల్లో సంయమనం పాటించాలని వ్యక్తుల స్వేచ్ఛ, భద్రతకు ప్రాముఖ్యతను ఇవ్వాలని మీడియాకు సూచించింది. జాతీయ మీడియాలో వార్తలు, ప్రచురుణ, ప్రసారాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్