https://oktelugu.com/

ఛాన్స్ లు కోసం హాట్ నెస్ కే యాంకర్ ఫిక్స్ !

జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. ఎన్నో ఆటుపోట్లు భరించి చివరికి హాట్ యాంకర్ గా క్రేజ్ తెచ్చుకుని.. ఆ క్రేజ్ తో చిన్న సినిమాల్లో హీరోయిన్ అయింది రష్మి గౌతమ్. అయితే వెండితెరైనా బుల్లితెరైనా అందాల భామలకు తక్కువ కెరీరే ఉంటుంది. ఈ మధ్యలో వాళ్ల కెరీర్లో ఎప్పుడో ఒకసారి డల్ ఫేజ్ ను భరించాల్సిందే. ప్రస్తుతం ఈ హాట్ యాంకర్ కూడా అలాంటి దశలోనే ఉందని, అమ్మడు తెగ ఇదైపోతోందట. ఒకపక్క తన […]

Written By:
  • admin
  • , Updated On : July 16, 2020 / 07:26 PM IST
    Follow us on


    జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. ఎన్నో ఆటుపోట్లు భరించి చివరికి హాట్ యాంకర్ గా క్రేజ్ తెచ్చుకుని.. ఆ క్రేజ్ తో చిన్న సినిమాల్లో హీరోయిన్ అయింది రష్మి గౌతమ్. అయితే వెండితెరైనా బుల్లితెరైనా అందాల భామలకు తక్కువ కెరీరే ఉంటుంది. ఈ మధ్యలో వాళ్ల కెరీర్లో ఎప్పుడో ఒకసారి డల్ ఫేజ్ ను భరించాల్సిందే. ప్రస్తుతం ఈ హాట్ యాంకర్ కూడా అలాంటి దశలోనే ఉందని, అమ్మడు తెగ ఇదైపోతోందట. ఒకపక్క తన కొలీగ్ అనసూయకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ పోతుంటే.. తనకు మాత్రం ఆ రేంజ్ డిమాండ్ రావట్లేదని రష్మీ బాధ పడుతుందట.

    అయితే టీవీ షోలలో అవకాశాలు ఉన్నప్పటికీ సినిమాల్లో మాత్రం ఈ ముదురు బ్యూటీకి చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవని, అదే అనసూయకైతే స్టార్ హీరోల సినిమాల్లోనూ మెయిన్ క్యారెక్టర్స్ ఇస్తున్నారని, తనకు మాత్రం సైడ్ క్యారెక్టర్ లు కూడా ఎందుకు ఇవ్వట్లేదని కనబడ్డ అందర్నీ అడుగుతుందట. ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండటానికి తరచుగా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండాలని, ముఖ్యంగా ఆ ఫోటోల్లో నీ గ్లామర్ ఓ రేంజ్ లో ఉండాలని, మెయిన్ గా నీలో గ్లామర్ ఇంకా తగ్గలేదని నిరూపించుకుంటేనే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని ఎవ్వరో సెలవిచ్చారట. దాంతో ఇక ఆ పని చేసేయాలని ఈ హాట్ భామ ఫిక్స్ అయిపోయింది.

    ఓటీటీలో ‘నవరసాలు’ పండించనున్న సూర్య

    నిజానికి రష్మి గౌతమ్ చూపుల్లోనే హాట్ నెస్ ఉన్నా.. అనసూయ భారీ అందాల ముందు రష్మి వయ్యారాలు తెలిపోతున్నాయి. అదే గ్లామర్ ను ఎలివేట్ చేయడంలో అనసూయను మించిపోతే.. టాలీవుడ్ డైరెక్టర్స్ అనసూయ కోసం ప్రత్యేకంగా రోల్స్ రాసినట్టు, రష్మి కోసం కూడా తమ సినిమాల్లో కీలకమైన రోల్స్ రాస్తారు. అలాగే ఆ మధ్య డబ్బులు ఇస్తున్నారు కదా అని, చిన్న చితకా సినిమాల్లో బాగానే హడావుడి చేసింది రష్మి.. మరి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావాలంటే.. ఊరు పేరు లేని సినిమాలకు దూరంగా ఉండాలి. కానీ ఈ అమ్ముడు మాత్రం ఇదంతా పట్టించుకోకుండా ముందుకు పోతే ఉపయోగం ఏముంది !