https://oktelugu.com/

విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

విశాఖ ఉక్క ఫ్యాక్టరీ కోసం ఏపీ అట్టుడుకుతోంది. ఈ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్న క్రమంలో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. వీరికి తోడుగా ఆయా ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్ర అధికార పార్టీ సైతం విశాఖ ఉక్కు కర్మగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెల్లనివ్వమని చెబుతోంది. దాదాపు 60 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు ఉపసంహకరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రకటించిన బడ్జెట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 8, 2021 9:26 am
    Follow us on

    విశాఖ ఉక్క ఫ్యాక్టరీ కోసం ఏపీ అట్టుడుకుతోంది. ఈ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్న క్రమంలో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. వీరికి తోడుగా ఆయా ప్రతిపక్ష పార్టీలు కలిసి వస్తున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్ర అధికార పార్టీ సైతం విశాఖ ఉక్కు కర్మగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెల్లనివ్వమని చెబుతోంది.

    దాదాపు 60 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు ఉపసంహకరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లోనూ ఈ అంశాన్ని చేర్చడం వంటి చర్యలతో ప్లాంట్ కార్మికులు భగ్గుమంటున్నారు. ఈ పరిమాణాలన్నీ పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలకు మోడీ వెనక్కి తగ్గపోతే ప్రైవేట్ అప్పగించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొననున్నట్లు సమాచారం.

    ఇటీవల అధికార వైఎస్సార్సీపీ ఎంపీ ఎంవీవీ ఉద్యమానికి మద్దతు తెలిపి కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు.. ఇలా రోజురోజుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం ఉధృతం దాల్చడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అప్రమత్తమయ్యారు. ఇదే కోవలో అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎంపీలు సైతం విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశారు.

    ఒకవేళ కేంద్రం మొండి వైఖరి వీడకపోతే స్టీల్ ప్లాంట్ లో నిర్వహించే బిడ్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొంటుందని తాజాగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నోపోరాటాల ఫలితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రాకు వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం విడిచిపెట్టదన్నారు. అయితే రాష్ట్రపునర్విభజనలో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులను భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్రం చెల్లించాలన్నారు.

    పునర్విభజనలో భాగంగా రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగింది, ఇప్పటికే ఓ స్టీల్ ఫ్యాక్టరీ రాష్ట్రానికి రావల్సి ఉంది. కానీ ఉన్న ఫ్యాక్టరీని ప్రభుత్వం ఇతరులకు అప్పగించాలన్నిచూస్తే చూస్తూ ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ బిడ్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. కాగా ఇప్పటికే ఈ విషయంపై జగన్ మోడీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

    మరోవైపు స్టీల్ ప్లాంటు కోసం ఉద్యమం విస్తరిస్తోంది. దాదాపు 60 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఇప్పటికే వైసీపీ ఎంపీ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. అటు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.