https://oktelugu.com/

షర్మిల పార్టీ కేసీఆర్ స్కెచ్ యేనా? బీజేపీని చీల్చడానికా?

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ అప్రతిహతంగా ఉంది.. బీజేపీ దూసుకొస్తోంది. కాంగ్రెస్ చతికిలపడింది.. బీజేపీని కొట్టేందుకు ఈ రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల ఇప్పుడు కొత్త పార్టీతో తెలంగాణలో రాజకీయం దిశగా సాగుతోందన్న ప్రచారం సంచలనమవుతోంది. ఇప్పటికే షర్మిల తెలంగాణలో ‘రాజన్న రాజ్యం’ అనే పార్టీ స్థాపిస్తుందని.. ఫిబ్రవరి 9న తన తల్లిదండ్రులైన ‘వైఎస్ఆర్-విజయమ్మ’ పెళ్లి రోజు సందర్భంగా ఈ ప్రకటన వస్తుందని అంటున్నారు. రేపే షర్మిల పార్టీ ప్రకటించబోతున్నారని […]

Written By:
  • NARESH
  • , Updated On : February 8, 2021 / 09:16 AM IST
    Follow us on

    తెలంగాణలో అధికార టీఆర్ఎస్ అప్రతిహతంగా ఉంది.. బీజేపీ దూసుకొస్తోంది. కాంగ్రెస్ చతికిలపడింది.. బీజేపీని కొట్టేందుకు ఈ రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల ఇప్పుడు కొత్త పార్టీతో తెలంగాణలో రాజకీయం దిశగా సాగుతోందన్న ప్రచారం సంచలనమవుతోంది. ఇప్పటికే షర్మిల తెలంగాణలో ‘రాజన్న రాజ్యం’ అనే పార్టీ స్థాపిస్తుందని.. ఫిబ్రవరి 9న తన తల్లిదండ్రులైన ‘వైఎస్ఆర్-విజయమ్మ’ పెళ్లి రోజు సందర్భంగా ఈ ప్రకటన వస్తుందని అంటున్నారు. రేపే షర్మిల పార్టీ ప్రకటించబోతున్నారని కూడా మీడియా జోరుగా ప్రచారం సాగుతోంది.

    షర్మిల పార్టీ ప్రకటన.. అనాధిగా తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోందట.. ఇప్పటికే వైఎస్ఆర్ సీఎంగా ఉన్న కాలంలో ఆయన పైకి తెచ్చిన నేతలంతా వైఎస్ఆర్ కొనియాడుతున్నారు. ఇటీవలే గద్వాల మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ సైతం తాను వైఎస్ఆర్ వల్లే రాజకీయాల్లో పైకి వచ్చానని తన వినమ్రత చాటుకున్నారు. ఇక వైఎస్ఆర్ వల్లే మంత్రి అయిన బీసీ నాయకురాలు కొండా సురేఖ ఇప్పటికీ వైఎస్ ఫ్యామిలీని గుండెల్లో పెట్టుకున్నా ఆమె కాంగ్రెస్ లో ఉన్నా వైఎస్ఆర్ ను మరిచిపోలేదు. వైఎస్ఆర్ ఏకంగా కేసీఆర్ పై పోటీ దింపిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సైతం వైఎస్ఆర్ ను మరిచిపోరు. వీరేకాదు.. పొన్నాల లక్ష్మయ్య, డీఎస్, జానారెడ్డి, ఉత్తమ్, సహా ఎంతో మందినేతలు వైఎస్ఆర్ వల్లే రాజకీయాల్లో ఎదిగారు. వైఎస్ఆర్ నుంచి ఎదిగిన నేతలే కాదు.. ఆయన వల్ల ప్రత్యక్ష లబ్ధి పొందిన ప్రజలు, నేతలు, కార్యకర్తలు కోట్లలో ఉన్నారు.

    ఇప్పుడు వారందరి గుండె చప్పుడు వినడానికి వైఎస్ఆర్ కూతురు షర్మిలమ్మ వస్తోంది. షర్మిల తెలంగాణలో ‘రాజన్న రాజ్యం’ అనే పార్టీ పెడితే ఖచ్చితంగా వీరిలో చాలా మంది ఆమె వెంట నడువడానికి రెడీగా ఉన్నారట.. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు షర్మిలతో టచ్ లోకి వచ్చారని.. ఆమె వారితో సంప్రదింపులు కూడా జరుపుతున్నారని భోగట్టా.. కానీ దీనిపై అధికారికంగా మాత్రం బయటపడడం లేదు. వైఎస్ఆర్ నమ్మిన బంటులనే షర్మిల తన పార్టీలోకి తీసుకుంటుందని.. వారికి పెద్ద పీట వేస్తుందని అంటున్నారు.

    ఇప్పటికీ వైఎస్ఆర్ తరుఫున తెలంగాణలో పార్టీలో పెడితే వైఎస్ఆర్ కేబినెట్ లో పనిచేసిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నామినేటెడ్ నేతలంతా రావడానికి రెడీగా ఉన్నారట.. ఈ మేరకు షర్మిల పార్టీ కోసం వారంతా ఎదురుచూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

    షర్మిల పార్టీ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్మాయంగానే పుడుతుందని.. అధికార టీఆర్ఎస్ ను చేరుకోవడానికి ఉధృతంగా ప్రారంభమవుతుందని అంటున్నారు.

    అయితే తెలంగాణలో షర్మిల పార్టీ వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆయన మిత్రుడు ఏపీ సీఎం జగన్ ఉన్నారని భోగట్టా.. ఈ మేరకు రాజకీయ వర్గాలన్నీ అనుమానిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయినా ఇప్పుడు బీజేపీ దూసుకొస్తోంది. బలంగా తయారవుతోంది. ఆ పార్టీ తెలంగాణలో ఎదగకుండా అందులో డీకే అరుణ, జి. వివేక్ సహా వైఎస్ఆర్ దిగ్గజ నేతలను చీల్చడానికే ‘షర్మిల’ పార్టీని తీసుకొస్తున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇది నిజమా కాదా అన్నది పక్కనపెడితే షర్మిల తెలంగాణలో పార్టీ అనగానే అందరిలోనూ ఇదే అనుమానం కలుగుతోందట..

    ఏపీలో లాగానే తెలంగాణలో సైతం షర్మిల పార్టీ అధికారంలోకి రావడానికి పక్కా కార్యాచరణతో ముందుకెళుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ అభిమాన నేతలను కలుపుకొని పార్టీని బలంగా తీర్చిదిద్దడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది. బీజేపీని చీల్చడం.. వైఎస్ఆర్ అభిమాన నేతలను ఏకం చేయడం.. చేస్తారట.. ఈ ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయో వేచిచూద్దాం..