ఆ మూడు చానెళ్లకు జగన్ సర్కార్ షాక్

ఏపీ సీఎం జగన్ అనుకున్నట్టే అన్నంత పని చేశారు. వైసీపీని టార్గెట్ చేసిన టీడీపీ అనుకూల మీడియాకు షాకిచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ ఈ మూడు చానెళ్లను అనుమతించకుండా నిషేధం విధించారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు విలేకరులను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా జగన్ సర్కార్ నిషేధించింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఐదురోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సోమవారం బీఏసీ సమావేశంలో సభ ఎన్నిరోజులు అనేది క్లారిటీ రానుంది. ప్రతిపక్ష టీడీపీ 10 రోజులు […]

Written By: NARESH, Updated On : November 30, 2020 1:57 pm
Follow us on

ఏపీ సీఎం జగన్ అనుకున్నట్టే అన్నంత పని చేశారు. వైసీపీని టార్గెట్ చేసిన టీడీపీ అనుకూల మీడియాకు షాకిచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల వేళ ఈ మూడు చానెళ్లను అనుమతించకుండా నిషేధం విధించారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు విలేకరులను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా జగన్ సర్కార్ నిషేధించింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఐదురోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సోమవారం బీఏసీ సమావేశంలో సభ ఎన్నిరోజులు అనేది క్లారిటీ రానుంది. ప్రతిపక్ష టీడీపీ 10 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.

Also Read: నేటి నుంచి సభాసమరం.. కొట్లాట దేనిపైనంటే?

ఏపీలోని బలమైన వైసీపీ, టీడీపీ మరో ఫైట్ కు రెడీ అవుతున్నాయి. ఏపీ అసెంబ్లీ సాక్షిగా తలపడేందుకు కత్తులు నూరుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం సిద్ధం కావడంతో హీట్ పెరిగింది. ఈనెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. గవర్నర్ ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. అసెంబ్లీ ఎప్పటివరకు అనేది నిర్ణయిస్తారు.

Also Read: కుప్పం నుంచి చంద్రబాబును గెంటేస్తారా..?

ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ప్రతి పక్ష టీడీపీ వ్యూహాలు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ముందుగానే అలెర్ట్ అయ్యింది. మండలి చైర్మన్ కు టీడీపీ లేఖ రాసింది. రెండు కీలక అంశాలను ప్రస్తావించడం విశేషం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం: ఏపీ పాలిటిక్స్

తాజాగా అసెంబ్లీలోకి మూడు మీడియా చానళ్లకు అనుమతి నిరాకరించడం చర్చనీయాంశమైంది. దీన్ని ప్రతిపక్ష టీడీపీ మండిపడుతోంది. మూడు చానెళ్లకు వెంటనే లోపలికి అనుమతించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజాగా స్పీకర్ తమ్మినేనికి లేఖ రాశారు. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలకు మీడియాను అనుమతించకుండా.. మీడియా పాయింట్ ను సైతం తీసివేస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో మీడియాను నిషేధించడం అప్రజాస్వామికం అని దుయ్యబడుతోంది. ఇక వైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో నిషేధించిన తెలుగు న్యూస్ చానెల్స్, పేపర్స్ ఏబీఎన్, టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి విలేకరులను అనుమతించాలని ఎమ్మెల్సీలు కోరారు. చట్ట సభల్లో కూడా మీడియా విషయంలో ప్రభుత్వం వివక్షకు పాల్పడుతుందని.. సమావేశాలకు మీడియాను అనుమతించకపోవడం ఆర్టికల్ 19 ని ధిక్కరించడమే అన్నారు.

తాజా అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీని ఇరుకున పెట్టేలా వ్యూహాలను సిద్దం చేశారు. ముందుగా మండలి చైర్మన్ కు టీడీపీ ఎమ్మెల్సీలు లేఖ రాశారు. సభ్యుల హక్కులను కాపాడాలని మండలి చైర్మన్ ను కోరారు. కోవిడ్ పేరుతో ప్రశ్నోత్తరాల సమయం లేకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. ప్రజా సమస్యలను లేవదీసి ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రశ్నోత్తరాల సమయానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

జగన్ ప్రభుత్వం గతంలోనే జీవోనంబర్ 2430 ద్వారా మీడియా హక్కులను హరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే శిక్షించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోను జాతీయ మీడియా కూడా తీవ్రంగా వ్యతిరేకించిందని టీడీపీ చెబుతోంది.