https://oktelugu.com/

వకీల్ సాబ్ లో పవన్, శృతి అలా కనిపించారు… లీకైన ఫోటో!

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పవన్ ని వెండితెరపై చూసి మూడేళ్లు అవుతుండగా ఈ మూవీపై అమితమైన ఆసక్తి నెలకొని ఉంది. హిందీ హిట్ మూవీ పింక్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 2019 సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. నిర్మాత దిల్ రాజు మరియు బోనీ కపూర్ సంయుక్తంగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 21, 2020 / 12:47 PM IST
    Follow us on


    పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పవన్ ని వెండితెరపై చూసి మూడేళ్లు అవుతుండగా ఈ మూవీపై అమితమైన ఆసక్తి నెలకొని ఉంది. హిందీ హిట్ మూవీ పింక్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 2019 సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. నిర్మాత దిల్ రాజు మరియు బోనీ కపూర్ సంయుక్తంగా వకీల్ సాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    Also Read: పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్ !

    ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. కాగా వకీల్ సాబ్ సెట్స్ నుండి వరుసగా ఫోటోలు లీక్ అవుతున్నాయి. తాజాగా వకీల్ సాబ్ షూటింగ్ సెట్స్ నుండి మరొక ఫోటో బయటికి వచ్చింది. పవన్ కళ్యాణ్… శృతి హాసన్ చేయిపట్టుకుని ఉండగా, ఆమె నవ్వుతున్న ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.పవన్ మరియు శృతి హసన్ పై ఓ సాంగ్ షూట్ చేస్తున్న సందర్భంలో ఆ ఫోటో లీకైనట్లు సమాచారం. కాగా వకీల్ సాబ్ మూవీలో శృతి హాసన్ పాత్రకు పెద్దగా నిడివి ఉండదు. ఓ పాట మరియు కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉంటాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో, నివేదా థామస్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

    Also Read: దుమ్ము రేపుతున్న ‘డర్టీ హరి’

    మరో వైపు పవన్ నటిస్తున్న మరొక ప్రాజెక్ట్ పై క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ లో అయన నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ మూవీలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిచడం విశేషం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించనున్నారు. ఎక్స్ ఆర్మీ అధికారి మరియు పోలీస్ మధ్య ఊరిలో జరిగే ఆధిపత్య పోరుగా ఈ చిత్రం ఉండనుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్