
ఏపీ సీఎం జగన్ అనుకున్నది సాధించారు. ఎన్నో అడ్డంకులు.. ఆటుపోట్లు,, కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగిలినా.. క్రిస్మస్ పండుగ నాడు పేదలకు ఇల్ల స్థలాల పట్టాల పంపిణీని పూర్తి చేసి పేదల సొంతింటి కలకు పునాదిరాయి వేశారు.
ఏపీ ప్రభుత్వం తాజాగా 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తోంది.గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర.. పట్టణాల్లో సెంటు చొప్పున ఈ స్థలాలు కేటాయించారు.ఇందులో ఒక బెడ్ రూం, హాలు, కిచెన్, వరండా వచ్చేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. సగం శ్లాబు, సగం రేకులతో ఆ ఇంటి డిజైన్ ను ఇప్పటికే ఖరారు చేశారు.
ఇళ్ల పట్టాలు క్రిస్మస్ సందర్భంగా పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. శంకుస్థాపనలు మాత్రం వచ్చే నెల 7వ తేదీని చేస్తోంది. మొదటి విడతలో 15 లక్షల ఇళ్లను నిర్మిస్తోంది.
అయితే పులివెందుల సహా కొన్ని చోట్ల నాలుగైదు లక్షల ఇళ్ల స్థలాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. 23 వేల కోట్ల విలువైన భూములను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. దేవాదాయ, మైనింగ్, రాజధాని భూములు, ఇలా అనేక వివాదాస్పద భూములను ప్రభుత్వం సేకరిస్తోంది. బాధితులు కోర్టుకు వెళ్లడంతో స్టేలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఇలాంటి భూముల్లోనూ మంజూరు పత్రాలను జగన్ సర్కార్ వస్తోంది. హైకోర్టు నుంచి స్టే ఆటంకాలు తొలిగిపోయాక ఇళ్ల స్తలాలిస్తామని చెబుతోంది.
జగన్ ప్రభుత్వం 17వేల కాలనీలు నిర్మించేందుకు సిద్ధమైంది. ఊరికి దూరంగానే వీటిని నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.