సినీ సెలబ్రెటీలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఎన్టీఆర్.. ఎంజీఆర్ లాంటి స్టార్లు సొంతంగా పార్టీలు స్థాపించి ముఖ్యమంత్రులుగా మారి ఆయా రాష్ట్రాలను శాసించిన సంగతి తెల్సిందే. వీరితోపాటు చాలామంది బడా స్టార్స్. నటీనటులు.. హీరోయిన్లు రాజకీయాల్లోకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
Also Read: బిగ్ బాస్-4 విజేత ఆ ఇద్దర్లోనే..!
అయితే రాజకీయాలు కొందరు స్టార్లకు అచ్చిరాగా.. మరికొందరికీ పీడకలను మిగిల్చాయి. స్టార్ హీరోలే కాకుండా హీరోయిన్లు సైతం పలు పార్టీల్లో చేరి ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. కేంద్రమంత్రులైన వారు ఉన్నారు. సీనియర్ హీరోయిన్లు రోజా.. జయసుధ.. జయప్రద.. ఖుష్బూ.. నగ్మా.. ఉర్మిళ.. మాధవీ లత తదితరులు పలు పార్టీల్లో చేరి రాజకీయాలకు గ్లామర్ రంగును అద్దుతున్నారు.
తాజాగా ఈ లిస్టులో మరో గ్లామర్ హీరోయిన్ చేరింది. టాలీవుడ్లోకి ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రాశికన్నా తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానంటూ సంచలన కామెంట్ చేసింది. రాశికన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ బీజీగా ఉంది. తాజాగా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశికన్నా రాజకీయాలపై స్పందించింది.
Also Read: ప్రభాస్ పక్కన ఛాన్స్.. ఆ సువర్ణావకాశం మీకు దక్కాలంటే ?
తనకు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందని.. త్వరలోనే రాజకీయాల్లోకి వెళుతానంటూ చెప్పి అందరికీ షాకిచ్చింది. అయితే తనకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదని.. కానీ ప్రజలకు మాత్రం ఎలా సేవ చేయాలో తెలుసని స్పష్టం చేసింది. తనకు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అధికారి కావాలనే కోరిక ఉండేదని అయితే నటిగా మారిపోయానని చెప్పింది. దీంతో ఈ గ్లామర్ బ్యూటీ రాజకీయాల్లోకి వెళ్లి ఎన్ని కష్టాలు పడుతుందోనని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్