https://oktelugu.com/

విరాట్, రోహిత్ మధ్య వివాదం నడుస్తోందా.?

టీమిండియాలో విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండు గ్రూపులు తయారయ్యాయని తెలుస్తోంది. వరల్డ్ కప్ లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలైన తర్వాతే కోహ్లీ-రోహిత్ ల మధ్య చెడినట్టు తెలుస్తోంది. ఆ మ్యాచ్ ఓటమికి బౌలింగ్‌ విభాగాన్ని నిందించారని తెలుస్తోంది. Also Read: ఫీల్డ్ లోనూ ‘బుట్టబొమ్మ’ను వదలని వార్నర్..! ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా సిడ్నీలో ఆడిన మొదటి వన్డేలో భారత్‌పై 66 పరుగుల తేడాతో గెలిచింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2020 / 01:27 PM IST
    Follow us on

    టీమిండియాలో విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండు గ్రూపులు తయారయ్యాయని తెలుస్తోంది. వరల్డ్ కప్ లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలైన తర్వాతే కోహ్లీ-రోహిత్ ల మధ్య చెడినట్టు తెలుస్తోంది. ఆ మ్యాచ్ ఓటమికి బౌలింగ్‌ విభాగాన్ని నిందించారని తెలుస్తోంది.

    Also Read: ఫీల్డ్ లోనూ ‘బుట్టబొమ్మ’ను వదలని వార్నర్..!

    ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా సిడ్నీలో ఆడిన మొదటి వన్డేలో భారత్‌పై 66 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో అది మూడు మ్యాచుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

    అయితే, ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి కంటే ఎక్కువగా ఇప్పుడు ఇంకో విషయం గురించే చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య ఏదైనా వివాదం వచ్చిందా అనేదే మాట్లాడుకుంటున్నారు.భారత జట్టు గత ఏడాది ఇంగ్లండ్‌లో ప్రపంచకప్ టోర్నీలో ఆడినపుడు మొట్టమొదట ఇలాంటి వార్తలు వచ్చాయి.

    అయితే, ప్రపంచకప్‌లో న్యూజీలాండ్‌తో ఆడిన సెమీ పైనల్ మినహా మిగతా మ్యాచుల్లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఒక విధంగా విరాట్ కోహ్లీకి అతిపెద్ద అండగా నిరూపితమయ్యాడు.

    Also Read: కోహ్లీ వద్దు.. రోహిత్ ముద్దు..

    కానీ, చాలాసార్లు ఒక ఆటగాడి ప్రదర్శనకు కెప్టెన్‌ నుంచి ఎలాంటి ప్రశంసలు దక్కాలో కోహ్లీ నుంచి రోహిత్‌కు అవి అందలేదు. కాలంతోపాటూ ఈ వివాదానికి కూడా తెరపడాల్సింది. కానీ అలా జరగలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను భారత్‌లోనే కాదు, ప్రపంచంలోనే అద్భుతమైన ఆటగాళ్లుగా భావిస్తారు. అందుకే, ఇద్దరిలో ఎవరూ ఒక అడుగు ముందుకు వచ్చి ఈ వార్తలకు తెరదించాలని ప్రయత్నించలేదు.

    టీమిండియా జట్టులో ఆటగాళ్ల మధ్య వివాదాలు మనస్పర్థలు రావడం ఎంతవరకు నిజమో తెలియదు గాని ఆటగాళ్ల ప్రవర్తన చుస్తే అప్పుడపుడు అది నిజమే అనిపిస్తుంది. గతంలో సీనియర్ ఆటగాళ్ల మధ్య కూడా విబేధాలు వచ్చినట్లు అనేక వార్తలు వచ్చేవి కానీ బిసిసిఐ వాటిని బయటికిరానివ్వకుండా పరిష్కరించేదని ఒక రూమర్ ఉంది. ఇకపోతే చాలా రోజుల తరువాత టీమిండియా ప్లేయర్ల మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది.