తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రణాళికాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాటల్ని చూస్తోంటే అది నిజమేనేమో అన్న అనుమానం కలుగుతోంది. గ్రేటర్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందట. మధ్యంతర ఎన్నికలు కూడా వచ్చేస్తాయట. గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన అన్నారు.
Also Read: ఎక్కడా దొరక్కుండా మాట్లాడిన కేసీఆర్!
కేసీఆర్ అవినీతి చిట్టా మొత్తం కేంద్రం వద్ద ఉందని.. సమయం వచ్చినప్పుడు ఆయనను జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు బండి సంజయ్. ప్రాజెక్టుల అంచనాలు పెంచుతూ కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని, కమీషన్ల కోసం కొన్ని కంపెనీలకు మేలు చేస్తోందని బండి సంజయ్ చాలా సార్లు ప్రకటించారు.
సంజయ్ అలా ప్రకటనలు చేసిన తర్వాత తెలంగాణ సర్కార్ ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చు వివరాలను కేంద్రం అడిగింది. తెలంగాణ సర్కార్ ఇచ్చిందో లేదో క్లారిటీ లేదు. కానీ ఓ అడుగు ముందుకు పడిందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమయింది. కేసీఆర్ కూడా.. బీజేపీ తనను టార్గెట్ చేసిందన్న అభిప్రాయంతో ఉన్నారంటున్నారు.
ఓ సారి ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు చేస్తోందని విరుచుకుపడ్డారు. తెలంగాణ సర్కార్ విషయంలో అలాంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పకపోయినా .. ఇటీవలి కాలంలో జరిగిన గోవా కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ , మహారాష్ట్ర వంటి రాష్ట్రల అంశాలను ఆయన ఉదహరించారు. మామూలుగా అయితే కేసీఆర్ వాటి గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ తెలంగాణలోనూ అలాంటి ప్రయత్నమే చేయబోతున్నారన్న అర్థంలో కేసీఆర్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
Also Read: ఎంఐఎం అతిపెద్ద పార్టీగా మారుతుందా..?
బీజేపీకి తెలంగాణ అసెంబ్లీలో వున్నది ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు. అందులో ఒకరు ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన రఘునందన్. మరొకరు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన రాజాసింగ్. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు, 100 మందికి పైగా ఎమ్మెల్యేలతో పూర్తి బలోపేతమై వున్న టీఆర్‌ఎస్‌ని ఢీకొనడం సాధ్యమయ్యే పనేనా.? గ్రేటర్ ఎన్నికలు వేరు, లోక్‌సభ ఎన్నికలు వేరు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడం వేరు.
అలా కేసీఆర్ సర్కార్ కూలిపోవాలంటే, టీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు పెరగాలి. అది బీజేపీతో సాధ్యమయ్యే పనేనా.? అంటే, ఏమో.. ఇప్పటికే ఆ ప్లాన్‌ని బీజేపీ ఎగ్జిక్యూట్ కూడా చేసేసి వుండొచ్చన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి విన్పిస్తోంది. ‘బీజేపీ ఇప్పటికే ఆ ప్లాన్‌ని అమలు చేయడం మొదలు పెట్టి వుండకపోతే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నోట, కేసీఆర్ సర్కార్ కూలిపోతుందనే మాట రాదు..’ అన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్