బీజేపీ సీఎం అభ్యర్థి సౌరభ్ గంగూలీయేనా?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గరపడుతున్న కొద్దీ అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ యమ రంజుగా మారుతోంది. బెంగాల్ సర్కార్ లోని మంత్రులు, ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ షాకివ్వగా.. మరికొందరినీ వెనక్కి లాగి దీది సీఎం మమతా బెనర్జీ అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. Also Read: రైతులకు ‘టైం’ ఫిక్స్ చేసిన కేంద్రం..! ఈ క్రమంలోనే బెంగాల్ లో ఎలాగైనా సరే గెలవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఇప్పుడు కొత్త అస్త్రాన్ని […]

Written By: NARESH, Updated On : December 29, 2020 11:30 am
Follow us on

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గరపడుతున్న కొద్దీ అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ యమ రంజుగా మారుతోంది. బెంగాల్ సర్కార్ లోని మంత్రులు, ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ షాకివ్వగా.. మరికొందరినీ వెనక్కి లాగి దీది సీఎం మమతా బెనర్జీ అంతే ఘాటుగా స్పందిస్తున్నారు.

Also Read: రైతులకు ‘టైం’ ఫిక్స్ చేసిన కేంద్రం..!

ఈ క్రమంలోనే బెంగాల్ లో ఎలాగైనా సరే గెలవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఇప్పుడు కొత్త అస్త్రాన్ని బయటకు తీసినట్టు తెలుస్తోంది. అతడు ఎవరో కాదు.. బెంగాల్ టైగర్.. దాదా సౌరబ్ గంగూలీనే అంటున్నారు.

ఇప్పటికే బీజేపీ ప్రోద్బలంతోనే బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరబ్ గంగూలీ గెలిచి దేశ క్రికెట్ రాజకీయాలను ఏలుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే బెంగాల్ ఎన్నికలకు ముందు సౌరవ్ ను బీజేపీలో చేర్చుకొని అతడిని బీజేపీ బెంగాల్ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ప్లాన్ చేసినట్టు సమాచారం.

Also Read: బీపీతో బాధ పడేవారికి గుడ్ న్యూస్.. ఆ మందులతో దీర్ఘాయువు..?

ఈ క్రమంలోనే సౌరబ్ గంగూలీ హఠాత్తుగా ఈరోజు బెంగాల్ గవర్నర్ జగదీప్ దన్ కర్ తో సౌరబ్ గంగూలీ భేటి కావడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ గవర్నర్ తో దాదా భేటి కావడం ఆసక్తి రేపింది. గంగూలీని బీజేపీ సీఎం క్యాండిడేట్ గా ఒప్పించడం కోసమే ఈ భేటి అన్న ప్రచారం జోరుగా సాగింది.

అయితే గవర్నర్ మాత్రం కేవలం ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం సందర్శించాలని గంగూలీ కోరాడని.. తాను వస్తానని చెప్పి మాట మార్చేశాడు. దీన్ని బట్టి బెంగాల్ రాజకీయాల్లో గంగూలీని అస్త్రంగా బీజేపీ ప్రయోగించబోతోందని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్