https://oktelugu.com/

కేసీఆర్‌‌కు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారా..?

తెలంగాణ ఉద్యమం.. తెలంగాణ సెంటిమెంట్‌తో ఇన్నాళ్లు కాలం వెళ్లదీస్తూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై ఇప్పుడు వ్యతిరేకత మొదలైనట్లే కనిపిస్తోంది. మాటిమాటికి ప్రజల్లో ఉద్యమ భావాలను రెచ్చగొడుతూ ఇన్నాళ్లు క్యాష్‌ చేసుకున్నారనేది ఇప్పుడు నడుస్తున్న టాక్‌. అంతేకాదు.. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకుండా పార్టీలను మట్టికరిపించారు. ఇదంతా మొన్నటి వరకు జరిగిన ముచ్చట. ఇక ఇప్పుడు దీటైన ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోంది. ఇది కేసీఆర్‌‌కు కొంత ఆందోళన కలిగించే అంశమే. Also Read: కేసీఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2020 / 08:19 AM IST
    Follow us on

    తెలంగాణ ఉద్యమం.. తెలంగాణ సెంటిమెంట్‌తో ఇన్నాళ్లు కాలం వెళ్లదీస్తూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై ఇప్పుడు వ్యతిరేకత మొదలైనట్లే కనిపిస్తోంది. మాటిమాటికి ప్రజల్లో ఉద్యమ భావాలను రెచ్చగొడుతూ ఇన్నాళ్లు క్యాష్‌ చేసుకున్నారనేది ఇప్పుడు నడుస్తున్న టాక్‌. అంతేకాదు.. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకుండా పార్టీలను మట్టికరిపించారు. ఇదంతా మొన్నటి వరకు జరిగిన ముచ్చట. ఇక ఇప్పుడు దీటైన ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోంది. ఇది కేసీఆర్‌‌కు కొంత ఆందోళన కలిగించే అంశమే.

    Also Read: కేసీఆర్ కాచుకో ఇక.. తొడగొట్టిన బీజేపీ

    అందుకే.. మొన్నటి దుబ్బాక దెబ్బకు బీజేపీ అంత తేలిగ్గా తీసుకోవద్దని కేసీఆర్ పార్టీ నేతలకు సూచిస్తూనే ఉన్నారు. బీజేపీ కూడా చాలా రాష్ట్రాల్లో ముందుగా ఒకటి రెండు సీట్లతో మొదలై తర్వాత బలోపేతం అయి అధికారం కూడా చేపట్టింది. క్షేత్రస్థాయిలో ఉన్న బలం.. కమిట్‌మెంట్‌ ఆ పార్టీకి బలమనే చెప్పాలి. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం వచ్చినా లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి నాలుగు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే.. పార్లమెంటు ఎన్నికల ఫలితాల నుంచే కేసీఆర్‌‌కు బీజేపీ బెంగ పట్టుకుంది.

    Also Read: కేసీఆర్ ఫెయిల్యూర్ కు అసలు కారణం అదేనా !?

    కానీ.. ఆ భయాన్ని అంతగా సీరియస్‌గా తీసుకోలేకపోయారు. మరోవైపు తెలంగాణలో బలమైన సామాజికవర్గం కేసీఆర్‌‌కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకూ ఆధిపత్యం వహించిన ఆ సామాజికవర్గం ఆరేళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉంటోంది. దీంతో కేసీఆర్ ఈ సామాజికవర్గం ఓట్లను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. దీంతో పాటు ఆర్థికంగా బలమైన మరో సామాజికవర్గం సైతం బీజేపీకి చేరువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఇప్పటివరకు కమ్మ, రెడ్డి, వెలమ ఈక్వేషన్లతో ముందుకు వెళ్తున్న కేసీఆర్‌‌కు రానున్న కాలంలో ఆ రెండు సామాజికవర్గాలు దూరమయ్యే అవకాశాలున్నాయంటున్నారు. రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ వైపు, కమ్మ సామాజికవర్గం బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశాలుండటంతో కేసీఆర్‌‌ ఆందోళనలో పడ్డారని సమాచారం. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో కేసీఆర్ వీటన్నింటినీ తట్టుకొని ఎలా నిలబడుతారా అనే సందేహాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్‌‌ నుంచి చాలా వరకు ప్రధాన సామాజిక వర్గాలు దూరమయ్యే పరిస్థితులే ఉన్నాయి.