https://oktelugu.com/

రెచ్చగొడుతున్న చైనా: అరుణాచల్ లో బరితెగింపు..

అరుణాచల్ సరిహద్దులో రైల్వే లైన్ నిర్మిస్తూ భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు చైనా పాల్పడుతోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులో కొత్త రైల్వేలైన్‌ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. సిచువాన్‌–టిబెట్‌ రైల్వే మార్గంలో భాగంగా నైరుతి సిచువాన్‌ ప్రావిన్స్‌లోని యాన్‌ నుంచి టిబెట్ లోని లింజీ వరకు ఈ కొత్త లైన్‌ నిర్మిస్తుంది. ఇది సరిగ్గా అరుణాచల్‌ సరిహద్దు నుంచే వెళ్లనుంది. దీంతో భారత్ ఆందోళన చెందుతుంది. లిన్షి ప్రాంతం అరుణాచల్‌ప్రదేశ్‌కు సమీపంలో ఉంటుంది. అరుణాచల్‌ప్రదేశ్‌ దక్షిణ టిబెట్‌లో భాగమని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2020 / 08:26 AM IST
    Follow us on

    అరుణాచల్ సరిహద్దులో రైల్వే లైన్ నిర్మిస్తూ భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు చైనా పాల్పడుతోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులో కొత్త రైల్వేలైన్‌ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. సిచువాన్‌–టిబెట్‌ రైల్వే మార్గంలో భాగంగా నైరుతి సిచువాన్‌ ప్రావిన్స్‌లోని యాన్‌ నుంచి టిబెట్ లోని లింజీ వరకు ఈ కొత్త లైన్‌ నిర్మిస్తుంది. ఇది సరిగ్గా అరుణాచల్‌ సరిహద్దు నుంచే వెళ్లనుంది. దీంతో భారత్ ఆందోళన చెందుతుంది. లిన్షి ప్రాంతం అరుణాచల్‌ప్రదేశ్‌కు సమీపంలో ఉంటుంది. అరుణాచల్‌ప్రదేశ్‌ దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తుండగా, భారత్‌ దానిని ఖండిస్తోంది.

    రెండు దేశాలు సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకుంటున్నాయి. అందుకే ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారత్‌ కూడా తన మౌలిక సదుపాయాలను పెంచుతోంది. 7-8 సంవత్సరాల్లో ఇక్కడ సౌకర్యాలు బాగా పెరిగాయి. అరుణాచల్‌ప్రదేశ్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు బ్రహ్మపుత్ర నది ప్రధాన నీటి వనరు. ఈ పరిస్థితుల్లో చైనా ఆ నీటి మొత్తాన్ని తనకే మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

    కొన్నేళ్లుగా సరిహద్దు ప్రాంతాల్లో నిలిచిపోయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను భారత్‌ చేస్తుండడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. భారతదేశం కొత్తగా విమానాశ్రయాలను, రోడ్లను నిర్మిస్తోంది. ఇటీవల లద్దాఖ్‌లో అటల్‌ టన్నెల్‌ను కూడా ప్రారంభించింది దీంతో చైనా కవింపు చర్యలకు పాల్పడుతుంది.

    భారత భద్రతా నిపుణుల ప్రకారం దౌలత్‌బేగ్‌ ఓల్డి రోడ్‌ ఒక వ్యూహాత్మక రహదారి. అది లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్ (వాస్తవాధీన రేఖ)కు సమాంతరంగా వెళుతుంది. దీని ద్వారా టిబెట్‌లోని జిన్జియాంగ్‌ హైవే వరకు భారత సైన్యం వెళ్లగలదు.

    భారతదేశంతో సరిహద్దుగా ఉన్న పొరుగు దేశాలలో పెట్టుబడులు పెట్టడం, ఓడరేవుల నిర్మాణాలను చైనా చేపడుతోంది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో చైనా దృష్టికోణం మారింది. చైనా, భారతదేశం మధ్య దూరం చాలా భిన్నంగా మారింది. అందువల్ల చైనా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని తెలుస్తోంది. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.