spot_img
Homeఅంతర్జాతీయంజోబైడెన్‌తో భారత్‌ లాభమా..? నష్టమా..?

జోబైడెన్‌తో భారత్‌ లాభమా..? నష్టమా..?

Modi Joe Biden

ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికాకు కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోయింది. నాలుగు రోజులుగా నడుస్తున్న ఉత్కంఠకు ఎట్టకేలకు ముగింపు దొరికింది. ఫైనల్‌గా జో బైడెన్‌ గెలుపొంది ఆ దేశానికి 46వ ప్రెసిడెంట్‌ కాబోతున్నారు. అయితే.. బైడెన్‌ గెలుపుతో భారత్‌తో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

ఎందుకంటే ట్రంప్‌ హయాంలో ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి. మరి కొత్తగా వచ్చే బైడెన్‌ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. భారత కోణంలోంచి చూస్తే విదేశాంగ విధానాల్లో జో బైడెన్‌కు భారత్‌ గానీ.. భారత్‌కు బైడెన్‌గానీ కొత్తేమీ కాదు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ 2016లో అమెరికాలో పర్యటించినప్పుడు బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇద్దరికి ఇప్పటికే పరిచయం ఉంది.

భారత్‌తో అమెరికా అనుబంధం గతంలో మాదిరిగా కాకుండా బలపడింది. దాన్ని బలహీనపర్చడం అంత సులవైంది ఏం కదు. చాలా అంశాల్లో భారత్‌ అండ లేకుండా పెద్దన్న పాత్ర పోషించడం కూడా అమెరికాకు సాధ్యం కాదు. పైగా.. బైడెన్‌ కూడా తన ఎన్నికల ప్రచారంలో భారత అమెరికన్లకు దగ్గరయ్యారు. భారత్‌తో స్నేహబంధాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేయాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.

మరోవైపు.. వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికవుతున్న కమలాహారిస్‌ కూడా భారత్‌ విషయంలో చాలా కీలకమనే చెప్పాలి. బైడెన్‌ ఒక్క నాలుగేళ్లు మాత్రమే పదవిలో ఉంటానని స్పష్టం చేశారు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కమలా హారిసే. దీంతో చాలా అంశాల్లో ఆమె ప్రభావం ఉండబోతోంది. భారత్‌తో రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు బహుశా రెండు దశాబ్దాలకాలంగా కొనసాగుతున్నట్లే కొనసాగుతాయి. వాణిజ్య బంధం కూడా దాదాపు అలాగే ఉండొచ్చు. అత్యంత కీలకమైన ఇండో–పసిపిక్‌ వ్యూహంపై బైడెన్‌ వర్గం ఇంకా తమ అభిప్రాయాన్ని చెప్పలేదు.

Also Read: ఎగ్జిట్ పోల్స్: బీహార్ లో అధికారం వీరిదే..

వీటికితోడు.. చైనా అమెరికా సంబంధాలు బైడెన్‌ హయాంలో ఎలా ఉండబోతాయనేది భారత్‌కు కీలకం. ట్రంప్‌లాగా చైనాతో ప్రతిదానికీ గొడవలు పెట్టుకోకపోవచ్చు. ఒకవేళ మెత్తగా వెళ్లినా అది బైడెన్‌కు కష్టమనే చెప్పాలి. పెద్దన్న పాత్ర కోసం ఎప్పుడెప్పుడా అన్నట్లు చైనా కాచుకు చూస్తోంది. చైనాతో బార్డర్ గొడవ విషయంలో ట్రంప్ భారత్‌ వైపు ఉండి చైనాకు వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ కన్నా మనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు బైడెన్ ప్రెసిడెంట్ కావడంతో.. ఆయన ఇండియాకు ట్రంప్ అంత మంచి దోస్త్ గా ఉండేది లేనిది కొద్ది రోజుల్లో తేలనుంది. బైడెన్ తో మనకు మంచిది కాదని కొందరు చెప్తుంటే.. ట్రంప్ దిగిపోయినా మనతో అమెరికా దోస్తానా అలాగే ఉంటుందని మరికొందరు అంటున్నారు.

హెచ్‌ 1బీ వీసాల విషయంలో హామీలిచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు పాజిటివ్‌గా ఉంటారనుకోలేం. జమ్మూకశ్మీర్‌‌లో 370 అధికరణ రద్దును డెమొక్రాట్లు ముఖ్యంగా కమలాహారిస్‌ వ్యతిరేకించారు. ఈ విషయంలో మాత్రం మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. కశ్మీరీల హక్కుల కోసం అవసరమైతే జోక్యం చేసుకోవాలని కూడా ఆమె గతంలో కామెంట్ చేశారు. వీరిద్దరూ వస్తే కశ్మీర్ విషయంలో ఇండియాకు వ్యతిరేకంగా ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. బార్డర్ గొడవ విషయంలో బైడెన్ మనకు ట్రంప్ అంత గట్టిగా సపోర్ట్ చేయకపోవచ్చని, రెండు దేశాలను చర్చలకు కూర్చోబెట్టేందుకు మాత్రం ప్రయత్నించొచ్చని భావిస్తున్నారు.

బైడెన్ ప్రెసిడెంట్ అయినా ఇండియా వర్రీ కావాల్సిన అవసరం లేదని, ఆయన కూడా ట్రంప్ లాగే మనతో దోస్తీ చేస్తారని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రెసిడెంట్ మారినంత మాత్రాన మనతో అమెరికా దోస్తాన్ ఏమీ మారదని అంటున్నారు. బైడెన్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇండియాకు ఇంటర్నల్ విషయాలైన ఎన్ఆర్సీ, సీఏఏ, కాశ్మీర్ వంటి అంశాలను లేవనెత్తకుండా ఆయన సైలెంట్ అయిపోతారని పేర్కొంటున్నారు.

Also Read: అమెరికాలో బైడెన్‌ విజయభేరి..! 284 ఓట్లతో అధ్యక్ష పదవికి ఎన్నిక

ఆక్రమణల విషయంలో చైనాపై ట్రంప్ పెద్దగా ప్రెజర్ పెట్టలేదని, బైడెన్ వచ్చినా చైనాపై ప్రెజర్ పెంచే ప్రయత్నం చేయకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ చైనాలు దగ్గర కావడం, చైనా ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ ఎవరొచ్చినా.. ఇండియాతో దోస్తీ చేయక తప్పదని ఇప్పుడు బైడెన్ కూడా అదే చేస్తాడని చెప్పుకొస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version