తిరుపతి లోక్ సభ ఎన్నికలు బీజేపీకి తరుచూ ఓ కొత్త తలనొప్పిని తెచ్చి పెడుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి సేవలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చింది. హిందువులు, హిందూయిజానికి తాము మాత్రమే ప్రతినిధులమని చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు.. అదే హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న శ్రీవారి సేవలపై సైతం జీఎస్టీలను వడ్డించడం సరికాదని, దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. తిరుపతి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న బీజేపీ నాయకులకు దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: కరుడుగట్టిన మోదీ.. పాకిస్తాన్ స్నేహం కోసం అర్రులు చాచడమా..?
తిరుమల, తిరుపతి దేవస్థానం ఏటా రూ.120 కోట్లను జీఎస్టీ కింద కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తోంది. కాటేజీల అద్దె మొదలుకుని భక్తులకు కల్పించే సౌకర్యాలను జీఎస్టీ కిందికి తీసుకొచ్చింది బీజేపీ సర్కారు. లడ్డూకు జీఎస్టీ మినహాయించినప్పటికీ.. ఆ ప్రసాదాన్ని తయారు చేసేందుకు అవసరం అయిన అన్ని రకాల వస్తువులపైనా టీటీడీ జీఎస్టీని చెల్లిస్తోంది. టీటీడీ బోర్డు పరిధిలోకి వచ్చే దాదాపు అన్ని ఆర్థిక వ్యవహారాలు, క్రయ విక్రయాలకు జీఎస్టీ వర్తిస్తుంది. వాటిని మినహాయించాలంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో డిమాండ్ చేశారు. దీనికి ప్రతిగా తొమ్మిదికోట్ల రూపాయాలు మాత్రమే కేంద్రం ఇన్ పుట్ సబ్సిడీగా టీటీడీకి చెల్లిస్తోందని గుర్తు చేశారు.
శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల నివాస వసతిని కల్పించడానికి ఉద్దేశించిన కాటీజీలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సరికాదని వైసీపీ నాయకులు అంటున్నారు. ప్రయివేటు హోటళ్ల తరహాలో టీటీడీ కాటేజీలపైనా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని వసూలు చేస్తోందని, భక్తుల సౌకర్యం కోసం కల్పించినందుకు మినహాయింపు ఇవ్వాలన్నది వారి డిమాండ్. టీటీడీ అనేది లాభార్జన కోసం ఏర్పాటైన పాలక మండలి కాదని, దాన్ని ధార్మిక,ఆధ్యాత్మిక సంస్థగా గుర్తించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇదే విషయాన్ని తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో అస్ర్తంగా వినియోగించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Also Read: రోజాకు మంత్రి పదవి కష్టమే.. కారణం ఇదే..
వైసీపీ నాయకులు తాజాగా తెరపైకి తెచ్చిన ఈ అంశాన్ని తిప్పికొట్టే పనిలో పడ్డారు బీజేపీ నాయకులు. దీనిపై ఎదురుదాడికి సిద్ధం అవుతున్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇది కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పుడే ఈ అంశాన్ని లేవనెత్తడానికి కారణం ఎంటని అడుగుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారని చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్