టాటా టియాగో కారును కొనుగోలు చేయడం ద్వారా డిస్కౌంట్ రూపంలో 20,000 రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. టాటా కంపెనీ ఈ కారును కొనుగోలు చేసేవాళ్లకు ఎక్స్చేంజ్ బోనస్ లో భాగంగా ఏకంగా 15,000 రూపాయలు డిస్కౌంట్ ను పొందే అవకాశం అయితే కల్పిస్తుండటం గమనార్హం. టాటా టియాగో కారును కొనుగోలు చేయడం ద్వారా మొత్తం 40,000 రూపాయలు తగ్గింపు బెనిఫిట్స్ ను పొందవచ్చు.
టాటా అల్ట్రోజ్ కారును కొనుగోలు చేయడం ద్వారా ఏకంగా 15,000 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. టాటా నెక్సన్ కారును కొనుగోలు చేయడం ద్వారా 15,000 రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ను పొందే అవకాశాలు ఉంటాయి. ఈ కార్లతో పోలిస్తే టాటా హరియర్ కారుపై ఎక్కువ మొత్తం డిస్కౌంట్ తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ కారు కొనుగోలు చేయడం ద్వారా రూ.65 వేలు డిస్కౌంట్ పొందే అవకాశాలు ఉంటాయి.
టాటా సఫారి కారును కొనుగోలు చేయడం ద్వారా రూ.25 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి. మోడల్ ను బట్టి వేరియంట్ ను బట్టి కార్ల ధరలలో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం. సమీపంలోని కారు డీలర్స్ ను సంప్రదించి కార్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.