India vs England 2nd Test: ఇంగ్లండ్ పై టీమిండియా గెలవడానికి ప్రధాన కారణం ఇదే

ప్రఖ్యాత ఇంగ్లండ్ లోని లార్డ్స్ స్టేడియంలో చివరి రోజు అద్భుతమే జరిగింది. ఓడిపోతుందనుకుంటున్న టీమిండియా గెలిచింది. గెలుస్తుందనుకున్న ఇంగ్లండ్ డ్రా చేసుకోకుండా బొక్క బోర్లా పడింది. దీనికి ప్రధాన కారణం ఎవరో తెలుసా? బౌలర్లే. అవును పరుగులు వాళ్లే తీశారు.. వికెట్లు వాళ్లే తీశారు. టీమిండియా టెయిలండర్ల పోరాట పటిమకు ఇంగ్లండ్ మోకరిల్లిన పరిస్థితి నెలకొంది. నాలుగో రోజు వరకూ టెస్టులో ఇంగ్లండ్ డే పైచేయిగా ఉంది. విజయాన్ని ఆశించే స్థితిలో ఉంది. రహానే, పూజారా పోరాడినా […]

Written By: NARESH, Updated On : August 18, 2021 10:48 am
Follow us on

ప్రఖ్యాత ఇంగ్లండ్ లోని లార్డ్స్ స్టేడియంలో చివరి రోజు అద్భుతమే జరిగింది. ఓడిపోతుందనుకుంటున్న టీమిండియా గెలిచింది. గెలుస్తుందనుకున్న ఇంగ్లండ్ డ్రా చేసుకోకుండా బొక్క బోర్లా పడింది. దీనికి ప్రధాన కారణం ఎవరో తెలుసా? బౌలర్లే. అవును పరుగులు వాళ్లే తీశారు.. వికెట్లు వాళ్లే తీశారు. టీమిండియా టెయిలండర్ల పోరాట పటిమకు ఇంగ్లండ్ మోకరిల్లిన పరిస్థితి నెలకొంది.

నాలుగో రోజు వరకూ టెస్టులో ఇంగ్లండ్ డే పైచేయిగా ఉంది. విజయాన్ని ఆశించే స్థితిలో ఉంది. రహానే, పూజారా పోరాడినా కూడా భారత్ కు ముప్పు పొంచి ఉంది. అప్పటికి భారత్ ఆధిక్యం 154 పరుగులు మాత్రమే. పంత్ తప్ప మెరుగైన బ్యాట్స్ మెన్ లేరు. కానీ ఐదోరోజు పంత్ (22) ను త్వరగా ఔట్ చేసిన ఇంగ్లండ్ ఇక 194 పరుగుల ఆధిక్యం ఉండడంతో గెలుపు ఈజీ అనుకున్నారు. ఇషాంత్ ను ఔట్ చేశారు. దీంతో టీమిండియా 200 లక్ష్యాన్ని కాపాడుకోలేదని ఓటమి ఖాయం అనుకున్నారంతా… కానీ అద్భుతమే జరిగింది.

https://twitter.com/BCCI/status/1427246702394761222?s=20

టెయిలండర్లు షమీ, బుమ్రా బ్యాట్ తో రెచ్చిపోయారు. 9వ వికెట్ కు ఏకంగా 89 పరుగులు జోడించి భారత్ కు ఓటమి ప్రమాదాన్ని తప్పించడమే కాదు.. ఏకంగా ఇంగ్లండ్ కే సవాల్ విసిరేలా 270కి పైగా పరులు లక్ష్యాన్ని నిర్ధేశించారు. షమీ, బుమ్రా జోడీనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. వీరిద్దరి పోరాటమే లేకుంటే భారత్ ఖచ్చితంగా ఓడిపోయేది. మ్యాచ్ లో గొప్ప మలుపు వీరిద్దరి బ్యాటింగ్ యే..

ఆ తర్వాత డ్రా కోసం ఆడిన ఇంగ్లండ్ ను చావుదెబ్బ తీసింది కూడా బుమ్రా, ఇషాంత్, సిరాయ్ లు.. ముఖ్యంగా డ్రా కోసం ఆడుతున్న ఇంగ్లండ్ కీపర్ బట్లర్ సహా చివరి వికెట్లను తీసి సిరాజ్, బుమ్రాలు భారత్ కు విజయాన్ని అందించారు. ముఖ్యంగా సిరాజ్ 4 వికెట్లతో చెలరేగి బ్యాటింగ్ చేసి భారత్ కు మరుపురాని విజయాన్ని అందించారు. మొత్తంగా ఇంగ్లండ్ పై ఓటమి నుంచి భారత్ గెలిచిందంటే బౌలర్లు షమీ, బుమ్రా, సిరాజ్ ల వల్లనే అనడంలో ఎలాంటి సందేహం లేదు.