ఇంగ్లండ్ తో టెస్టు: పట్టు బిగించిన భారత్.. నిలబడ్డ సుందర్, అక్షర్

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టుపై టీమిండియా పట్టు బిగింది. నిన్న సెంచరీతో రిషబ్ పంత్ బలమైన పునాది వేస్తే.. పంత్ కు అండగా నిలిచిన వాషింగ్టన్ సుందర్ ఈరోజు సెంచరీ దిశగా కదులుతున్నాడు. 72 పరుగులతో నాటౌట్ గా ఆడుతున్నాడు. అతడికి బౌలర్ అక్షర్ పటేల్ 26 పరుగులతో అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యాన్ని 117 పరుగులకు పెంచుకుంది. ఉదయం 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం […]

Written By: NARESH, Updated On : March 6, 2021 10:12 am
Follow us on

ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టుపై టీమిండియా పట్టు బిగింది. నిన్న సెంచరీతో రిషబ్ పంత్ బలమైన పునాది వేస్తే.. పంత్ కు అండగా నిలిచిన వాషింగ్టన్ సుందర్ ఈరోజు సెంచరీ దిశగా కదులుతున్నాడు. 72 పరుగులతో నాటౌట్ గా ఆడుతున్నాడు. అతడికి బౌలర్ అక్షర్ పటేల్ 26 పరుగులతో అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యాన్ని 117 పరుగులకు పెంచుకుంది. ఉదయం 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం టీమిండియా మరో 100 పరుగులు చేసినా.. సుందర్ సెంచరీ చేసినా ఇండియా ఈ టెస్టుపై పట్టు బిగించడం ఖాయంగా కనిపిస్తోంది.

నిన్న పంత్ సెంచరీ, సుందర్ హాఫ్ సెంచరీ చేయడంతో ఇండియా 300 పరుగులకు చేరువైంది. ఈరోజు ఉదయం కూడా నిలకడగా ఆడుతుంది. సుందర్, అక్షర్ పటేల్ లు ఫోర్లు కొడుతూ నిలకడగా ఆడుతున్నారు. లంచ్ వరకు ఆడితే టీమిండియా భారీ స్కోరు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఏమేరకు ఆడుతుంది? టీమిండియా ఎంత లోపు ఇంగ్లండ్ ను ఆలౌట్ చేస్తుందనే దానిపై భారత విజయం ఆధారపడి ఉంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ అంతా విఫలమైనా కూడా పంత్, సుందర్ లు వీరోచితంగా ఆడి ఈ టెస్టుపై భారత్ కు ఆధిక్యాన్ని తెచ్చిపెట్టారు. ఈ జోడిని విడదీయడానికి ఇంగ్లండ్ బౌలర్లు కష్టపడుతున్నారు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 294/7తో పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 89 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ 101 పరుగులు చేసి భారత్ ను పోటీలో నిలబెట్టాడు. అతడికి వాషింగ్టన్ సుందర్ 60 నాటౌట్ తో అండగా నిలబడడంతో వీరిద్దరూ భారత్ ను గట్టెక్కించారు. ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిపారు. ప్రస్తుతం క్రీజులో సుందర్ 60 పరుగులతో, అక్షర్ పటేల్ 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.