https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. భారీవేతనంతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు..?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 885 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఐఓసీఎల్ ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలలో కొన్ని ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేస్తుంటే మరికొన్ని ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. https://iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఐటీఐ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 18, 2021 1:55 pm
    Follow us on

    IOCL

    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 885 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఐఓసీఎల్ ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలలో కొన్ని ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేస్తుంటే మరికొన్ని ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. https://iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఐటీఐ అర్హతతో నావీలో ఉద్యోగాలు..?

    ఐవోసీఎల్ ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నీకల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. 16 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కెమికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో బీఎస్సీ లేదా పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు మొత్తం 869 ఉన్నాయి.

    Also Read: బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. భారీ వేతనంతో బెల్ లో ఉద్యోగాలు..?

    ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానిక్, మెషినిస్ట్, ఫిట్టర్ ఉత్తీర్ణులైన వాళ్లు టెక్నికల్ నాన్ టెక్నికల్ అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలలో కొన్ని ఉద్యోగాలకు ఫిబ్రవరి 26వ తేదీ చివరి తేదీగా ఉండగా మరికొన్ని ఉద్యోగాలకు మార్చి 7 చివరి తేదీగా ఉంది. ఇంటర్ పాసై డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో స్కిల్ సర్టిఫికెట్ ను పొందిన వాళ్లు కూడా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు భారీగా వేతనం లభిస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.