https://oktelugu.com/

పట్టుబిగిస్తున్న టీమిండియా.. విజయం ముంగిట భారత్‌

ఇప్పటికే ఫస్ట్‌ టెస్టు ఓటమితో కసి మీద ఉన్న టీమిండియా రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించాలని పోరాడుతోంది. బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు అలౌట్‌ అయిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కంగారూలను కట్టడి చేసింది.సోమవారం మూడో రోజు ఆట నిలిచిపోయే సరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దీంతో భారత్‌ కన్నా రెండు పరుగుల ఆధిక్యం మాత్రమే సాధించింది. ప్రస్తుతం కామరూన్‌ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 28, 2020 2:56 pm
    Follow us on

    Team India
    ఇప్పటికే ఫస్ట్‌ టెస్టు ఓటమితో కసి మీద ఉన్న టీమిండియా రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించాలని పోరాడుతోంది. బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు అలౌట్‌ అయిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కంగారూలను కట్టడి చేసింది.సోమవారం మూడో రోజు ఆట నిలిచిపోయే సరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దీంతో భారత్‌ కన్నా రెండు పరుగుల ఆధిక్యం మాత్రమే సాధించింది. ప్రస్తుతం కామరూన్‌ గ్రీన్‌ (17), పాట్‌ కమిన్స్‌ (15) క్రీజులో ఉన్నారు. ఇక మంగళవారం భారత బౌలర్ల పర్‌‌ఫార్మెన్స్‌ పైనే టీమిండియా విజయం ఆధారపడి ఉంది.

    Also Read: రెండో టెస్టుపై పట్టుబిగించిన..131 పరుగుల ఆధిక్యం

    ఐదు వికెట్ల నష్టం.. 277 ఓవర్‌‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 49 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. రహానె 223 బంతుల్లో 112 పరుగుల కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు తోడు రవీంద్ర జడేజా 159 బంతుల్లో 57 పరుగులు చేశాడు. టెయిలెంటర్లు రాణించకపోవడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేయగలిగారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై 131 పరుగుల ఆధిక్యం సాధించింది.

    రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌‌ జో బర్న్స్‌ (4)ను ఉమేశ్‌ యాదవ్‌ నాలుగో ఓవర్‌‌లోనే ఔట్‌ చేశాడు. ఆపై లబుషేన్‌ (28), మాథ్యువేడ్‌ (48) వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే.. అశ్విన్‌ వేసిన బంతికి లబుషేన్‌ పెవిలియన్‌ చేరాడు.

    Also Read: బాక్సింగ్ డే టెస్టులో రిషబ్ పంత్ అరుదైన రికార్డు..!

    తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్‌ (8) మరోసారి నిరాశపరిచాడు. బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. లెగ్‌సైడ్‌ వెళ్తున్న ఆల్‌.. వికెట్ల అంచున తాకడంతో బెయిల్స్‌ ఎగిరిపడ్డాయి. అయితే.. ఈ విషయాన్ని ముందుగా బుమ్రా కానీ,, స్మిత్‌ కానీ గమనించలేదు. తర్వాత తేరుకొని చూసే సరికి బెయిల్స్‌ పడిపోయాయి. దాంతో స్మిత్‌ వెనుతిరిగాడు. ఈ క్రమంలోనే వేడ్‌, టిమ్‌పైన్‌ (1), ట్రావిస్‌ హెడ్‌ (17) ఒక్క పరుగు తేడాలో ఔటయ్యారు. మహ్మద్‌ సిరాజ్‌ హెడ్‌ (19)ను బోల్తా కొట్టించాడు. దీంతో 99 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ ఆస్ట్రేలియా ఓటమి దిశగా సాగింది.