జీహెచ్ఎంసీలోని 150డివిజన్లకుగాను నిన్న 149స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ కు నేడు పోలింగ్ జరుగుతోంది. చెదురుముదురు సంఘటనలు మినహా జీహెచ్ఎంసీ ఎన్నికలు దాదాపు ప్రశాంతగానే ముగిసింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగరవాసులు ఓటింగులో పెద్దగా పాల్గొనకపోవడం విమర్శలకు తావిచ్చింది.
Also Read: గ్రేటర్ ‘ఫెయిల్యూర్’.. ఓటర్లది కాదా.. మరీ ఎవరిదీ?
నగరవాసులు బద్దకస్తులు.. సోంబోరులు.. ఎన్నికల కోసం సెలివిస్తే మంచిగా తిని పండుకున్నారంటూ నిన్నంత మీడియా.. సోషల్ మీడియా కోడైకూసింది. తీరా ఎన్నికల సంఘం ప్రకటించిన పోలింగ్ శాతం చూస్తే నగరవాసులు బద్ధకస్తులు.. సోంబేరులు కాదని మీడియాను తొందరపడిందనేది స్పష్టమవుతోంది. అయితే చివరిగంటలో పోలింగ్ శాతం 9శాతం పెరిగడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల సంఘం నిన్నటి సాయంత్రం 5గంటల వరకు 35.80శాతం పోలింగ్ జరిగినట్లు ప్రటించింది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పొలింగ్ సరళిని చూస్తే మిగతా గంటలో మహా అయితే ఒకటి రెండుశాతం పోలింగ్ పెరిగే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఆఖరి గంటలో మిరాకల్ జరిగిందని ఎన్నికల అధికారులు ప్రకటించిన పోలింగ్ శాతం చూస్తే అర్థమవుతోంది.
నిన్నటి పోలింగ్ సరళిని ఒకసారి పరిశీలిస్తే.. ఉదయం 7నుంచి 9గంటల వరకు పోలింగ్ కేవలం 3.96శాతంగా నమోదైంది. 11గంటల వరకు 8.90శాతం పోలింగ్. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 18శాతం పోలింగ్ జరిగింది. 3గంటల వరకు కూడా 25శాతంలోపే నమోదైంది. ఇక సాయంత్రం 5 గంటల వరకు 35.80 శాతంగా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
Also Read: కొయ్యూరు నెత్తుటి గాయానికి….20ఏళ్లు
ఇక ఓటింగ్ ముగియడానికి గంట సమయమే ఉంది. ఎక్కడా కూడా ఓటర్లు బారులు తీరిన దాఖలు కన్పించలేదు. దీంతో మీడియాగానీ.. ఎన్నికల సంఘంగానీ ఓటర్లు బారులు తీరినట్లు ఎక్కడా కూడా ప్రకటించలేదు. అయితే చివరిగంటలో 9శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు ప్రకటించడం గమనార్హం. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు రాని నగర ఓటర్లు చివరిలో గంటలో ఎలా వచ్చారనేది మిరాకిల్ గా మారింది.
చివరిలో గంటలో భారీగా పోలింగ్ శాతం నమోదవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో కొందరు దొంగ ఓట్లు.. రిగ్గింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే 0.50శాతం ఎక్కువగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. 2016లో 45.29శాతం పోలింగ్ నమోదుకాగా 2020లో 45.71శాతంగా నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మొత్తానికి చివరి గంటలో నగరవాసులు అద్భుతం చేశారా? లేక ఎన్నికల అధికారులే చేశారా? అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్