పెళ్లి చేసుకుంటే జైలుకే.. పెళ్లిళ్లకు బ్రేక్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగాన్ని వినిపిస్తోంది. కేసులు, మరణాలు లెక్కలేనన్ని నమోదవుతున్నాయి. కరోనాను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావడం లేదు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు.. లాక్ డౌన్లను పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేశాయి. ఈ సమయంలో వివాహాలు, సభలు, సమావేశాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పరిమితికి మించి చేస్తే వారిపై కేసులు, జైలుకు కూడా పంపిస్తోంది. ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెట్టినా కూడా కొంతమంది బడాబాబులు ఘనంగా పెళ్లిళ్లకు […]

Written By: NARESH, Updated On : April 30, 2021 11:52 am
Follow us on

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగాన్ని వినిపిస్తోంది. కేసులు, మరణాలు లెక్కలేనన్ని నమోదవుతున్నాయి. కరోనాను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావడం లేదు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు.. లాక్ డౌన్లను పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేశాయి. ఈ సమయంలో వివాహాలు, సభలు, సమావేశాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పరిమితికి మించి చేస్తే వారిపై కేసులు, జైలుకు కూడా పంపిస్తోంది.

ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెట్టినా కూడా కొంతమంది బడాబాబులు ఘనంగా పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేస్తూ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి పోలీసులు, అధికారులు షాకిచ్చి కేసులు పెట్టి మరీ జైలుకు పంపుతున్నారు.

త్రిపురలో ఓ పెళ్లిని స్వయంగా కలెక్టర్ వచ్చి ఆపేసి వధూవరులు, కుటుంబసభ్యులను అరెస్ట్ చేశారు. ఇక మధ్యప్రదేశ్ లోనూ ఇదే జరిగింది.

లాక్ డౌన్ నైట్ కర్ఫ్యా నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసుకోవాలనుకునే వారికి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గ్రాండ్ గా ఈ సమయంలో పెళ్లిచేసుకుంటే జైలుకు వెళ్లడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిపై కేసులు , అరెస్ట్ ల దాకా వెళ్లింది వ్యవహారం.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలాఖరు నుంచి మే వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. మే నెలలోనే సుమారు 2 లక్షల నుంచి 2.5 లక్షల వివాహ వేడుకలు జరగాల్సి ఉంది. ఇప్పటికే చాలా మంది పెళ్లిళ్లకు ఫంక్షన్ హాళ్లు, హోటళ్లను ముందుగానే బుక్ చేశారు. సెకండ్ వేవ్ రాదని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి అడ్వాన్స్ లు ఇచ్చారు.

అయితే సడెన్ గా వచ్చిన కరోనా సెకండ్ వేవ్ తో ఇప్పుడు భారీగా వివాహాలు నిలిచిపోతున్నాయి. కొందరు మాత్రం కొద్దిమందితో తూతూమంత్రంగా పెళ్లికి రెడీ అయిపోతున్నాయి. నిలిచిపోయిన వివాహాలకు అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వడానికి చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. ఇక పెళ్లి వాయిదా వేస్తే వధూ వరుల కుటుంబ సభ్యుల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి.