https://oktelugu.com/

హైదరాబాద్ పర్యటన: కేసీఆర్ కు షాకిచ్చిన మోడీ

ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు విమానాశ్రయం వద్దే రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సారి కూడా అలాగే చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భావించారట. శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చింది. కానీ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం […]

Written By: NARESH, Updated On : November 28, 2020 10:03 am
Follow us on

ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు విమానాశ్రయం వద్దే రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సారి కూడా అలాగే చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భావించారట. శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చింది. కానీ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమాచారం అందింది.

Also Read: పేదలకు ప్రధాని మోదీ శుభవార్త.. ఆ స్కీమ్ గడువు పొడిగింపు..?

ప్రధాన మంత్రికి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి వ్యక్తిగత సహాయకుడు వివేక్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పారట. అంతే కాకుండా ప్రధాన మంత్రికి స్వాగతం చెప్పడానికి కేవలం ఐదుగురికి మాత్రమే పిఎంవో అవకాశం ఇచ్చింది.

హకీంపేట ఎయిర్ ఆఫిస్ కమాండెంట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డి.జి.పి. మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామొహంతి, సైబరాబాద్ సి.పి. సజ్జనార్ లు మాత్రమే హకీంపేట విమానాశ్రయానకి రావాలని పిఎంవో ఆదేశాలు పంపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అవాక్కయ్యింది.

గతంలో ఏ ప్రధాన మంత్రి అయినా రాష్ట్రాల్లో అధికారిక పర్యటన జరపడానికి వస్తే గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు స్వాగతం చెప్తారు. కానీ ఈ సారి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి కార్యాలయం వారించడం విశేషం. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి గతంలో ఇలాంటి ఆదేశాలు ఎన్నడూ రాలేదని, ఇలా ఎందుకు చేశారో అర్ధం కావడం లేదని సీనియర్ అధికారులు అనుకుంటున్నారు.

Also Read: పవన్‌కు నిలకడ ఎప్పుడొస్తుంది?

టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్న మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం తీరును తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లోనూ రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి సహకారం అందించటం లేదని చెప్పటమే కాదు.. రానున్న రోజుల్లో తాను ప్రధాని కావాలన్న ఆకాంక్ష ఆయన మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

శనివారం నగరానికి వస్తున్న ఆయన.. కరోనా వ్యాక్సిన్ రూపొందిస్తున్న భారత్ బయోకాన్ సంస్థను సందర్శించనున్నారు. హైదరాబాద్ శివారులోని హకీంపేటకు మోదీ చేరుకునే సమయానికి కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన కీలకమైన బహిరంగ సభను ఎల్ బీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ హాజరవుతారు. సీఎం కూడా వెళతారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వెళ్లే అవకాశం తక్కువ అంటున్నారు. తమ బహిరంగ సభను పక్కదారి పట్టించటంతో పాటు.. అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకోవటానికి ప్రధాని మోడీ ప్రోగ్రాంను హడావుడిగా ఏర్పాటు చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.