Priyanka Success story: మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు.. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లలో, మంచి పేరున్న స్కూల్స్/కాలేజీల్లో చదివించాలని అనుకుంటూ ఉంటారు. కానీ పెరిగిన ఫీజుల వల్ల చాలామంది ఆ కలను మధ్యలోనే వదులుకుంటారు. తమ జీవితం ఎలా ఉన్నా కానీ పిల్లల జీవితాలు బాగుండాలని చాలామంది పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు కష్టపడి ప్రైవేట్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లలో అడ్మిషన్ తీసుకున్నా.. ఫీజులు కట్టలేక పిల్లలను మధ్యలోనే మాన్పించే ఘటనలు మనకు చాలా కనిపిస్తుంటాయి.
అచ్చం ఇలానే ప్రియాంక అనే అమ్మాయికి కూడా జరిగింది. ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కట్టలేని స్థితిలో.. స్కూల్ యాజమాన్యం ఆ అమ్మాయిని స్కూల్ కు రావద్దని చెప్పింది. తినడానికి తిండి కూడా దొరకని ఆ అమ్మాయి కుటుంబం.. భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్ లో చదివిద్దామనుకుంటే.. ఫీజు కట్టలేని స్థితిలో ఆ అమ్మాయి స్కూల్ మానెయ్యాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఆ అమ్మాయి ట్యాలెంట్ కు అమెరికా స్వాగతం పలికింది. అక్కడ ఆమె గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
హైదరాబాద్ కు చెందిన ప్రియాంక అనే అమ్మాయి.. 5వ తరగతి చదువుతున్న సమయంలో స్కూల్ ఫీజు కట్టలేదని స్కూల్ మాన్పించారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయిన ఆ చదువుల తల్లి.. తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో సీటు సాధించింది. అనుదినం కష్టపడి చదువుతూ.. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ చేస్తున్న సమయంలోనే కాలేజ్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రాం గురించి అధ్యాపకుల ద్వారా తెలుసుకున్న ఆ చదువుల తల్లి.. దానిపై ఫోకస్ పెట్టింది.
ఆ ప్రోగ్రాం కోసం అన్ని రకాలుగా సన్నధమై, అన్ని ఫేజులను దాటింది. ఇంకేముంది ఆ అమ్మాయి ట్యాలెంట్ కు అమెరికా సాదరంగా స్వాగతం పలికింది. ఏడాది పాటు అక్కడే అమెరికా స్కాలర్ షిప్ మీద ప్రాజెక్టు పూర్తి చేసింది. అక్కడ తన ట్యాలెంట్ చూపించి గోల్డ్ మెడల్ సాధించింది. తినడానికి తిండి లేని స్థితి నుండి, స్కూల్ ఫీజు కట్టలేని స్థితి నుండి అమ్మాయి.. అమెరికాలో గోల్డ్ మెడల్ సాధించిన తీరు అందరికీ ఆదర్శం. ఇలాంటి మరింత ప్రియాంకలు సమాజంలో గుర్తింపు కోసం కష్టపడుతున్నారు. వారందరికీ వీలైతే ఆర్థికంగా, లేదంటే కనీసం మోరల్ గా అయినా అండగా నిలుద్దాం.