Double Engine and BJP Bulldozers: తెలుగు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్, బీజేపీ బుల్డోజర్లు పనిచేస్తాయా?

Double Engine and BJP Bulldozers: దేశంలో నాలుగు రాష్ట్రాల్లో కనిపించిన ఊపుతో బీజేపీ జోష్ పెంచుతోంది. ప్రాంతీయ పార్టీల హవా తగ్గించాలని ప్రణాళికలు తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, తమిళనాడులో డీఎంకే, పశ్చిమబెంగాల్ లో టీఎంసీ పార్టీలు చక్రం తిప్పుతున్న నేపథ్యంలో వాటికి గాలం వేయాలని బీజేపీ చూస్తోంది. దీని కోసం పార్టీల్లో చీలికలు తీసుకొచ్చి ప్రయోజనం పొందాలని ఆలోచిస్తోంది. ఇందుకు గాను ఇప్పటికే వ్యూహాలు ఖరారు చేస్తున్నట్లు […]

Written By: Srinivas, Updated On : March 14, 2022 1:21 pm

PM Narendra Modi

Follow us on

Double Engine and BJP Bulldozers: దేశంలో నాలుగు రాష్ట్రాల్లో కనిపించిన ఊపుతో బీజేపీ జోష్ పెంచుతోంది. ప్రాంతీయ పార్టీల హవా తగ్గించాలని ప్రణాళికలు తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, తమిళనాడులో డీఎంకే, పశ్చిమబెంగాల్ లో టీఎంసీ పార్టీలు చక్రం తిప్పుతున్న నేపథ్యంలో వాటికి గాలం వేయాలని బీజేపీ చూస్తోంది. దీని కోసం పార్టీల్లో చీలికలు తీసుకొచ్చి ప్రయోజనం పొందాలని ఆలోచిస్తోంది. ఇందుకు గాను ఇప్పటికే వ్యూహాలు ఖరారు చేస్తున్నట్లు సమాచారం.

BJP

ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా పాగా వేయాలని భావిస్తోంది. దీనికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఎలాగైనా ఏపీలో కూడా అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ప్రాంతీయ పార్టీల హవాకు అడ్డుకట్ట వేయాలని బీజేపీ అన్ని రకాలుగా మార్గాలు అన్వేషిస్తోంది. అవి ఎదగనీయకుండా చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. ప్రాంతీయ పార్టీలతోనే నష్టం ఉంటుందని చెబుతోంది.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ సైతం తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. ఢిల్లీ నుంచి పంజాబ్ కు విస్తరించి బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనని సవాలు విసురుతోంది. ఈ క్రమంలో ఆప్ విధానాలు ప్రజలకు నచ్చి పంజాబ్ లో అధికారం కట్టబెట్టడంతో ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా తన ప్రభంజనాన్ని సృష్టించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో దూసుకుపోవాలని వ్యూహాలు ఖరారు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్ఎస్ కు సవాలు విసిరిన సందర్భంలో రాబోయే ఎన్నికల్లో అధికారం సాధించాలని అడుగులు వేస్తోంది.

తాజా పరిణామాల ప్రభావంతో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. అధికారం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో గెలిచి ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. దీనికి గాను ఇప్పటి నుంచే నేతల్లో జోష్ నింపేందుకు సిద్ధమవుతోంది. తెర వెనుక ఉండి రాజకీయం చేసి అయినా దక్షిణాదిన అధికారంలోకి రావాలని బీజేపీ ఆశిస్తోంది. ఏదిఏమైనా బీజేపీ కల నెలవేరుతోందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Tags