ఈ మధ్య కాలంలో ఎస్బీఐ బ్యాంకు ప్రాంగణంతో పాటు రోడ్డు పక్కన ఉండే దుకాణాలలో, ప్రైవేట్ స్థలాలలో ఏటీఎం సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. మీ దగ్గర ఖాళీగా భూమి లేదా దుకాణం జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉంటే అందులో ఏటీఎంను ఇన్ స్టాల్ చేయడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. ఏటీఎంను ఏర్పాటు చేయాలని అనుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
ఎస్బీఐ ఏటీఎంను ఇన్ స్టాల్ చేయాలని అనుకుంటే మొదట బ్యాంకును సంప్రదించాలి. బ్యాంక్ నిబంధనలను అనుసరించి సమీపంలో ఉన్న రీజినల్ బిజినెస్ ఆఫీస్ కు ఏటీఎం వ్యవస్థాపన కొరకు దరఖాస్తు చేసుకోవాలి. https://bank.sbi/web/home/locator/branch వెబ్ సైట్ లింక్ ద్వారా రీజినల్ బిజినెస్ ఆఫీస్ చిరునామాను తెలుసుకోవచ్చు. ఏటీఎంను ఇన్ స్టాల్ చేయాలనుకుంటే ఏటీఎంను సెటప్ చేయగలిగే భూమి ఉండాలి.
ఏటీఎంను ఏర్పాటు చేసే ప్రదేశం ఒక దుకాణంలా ఉండాలి. బ్యాంకులతో పాటు కొన్ని ఏజెన్సీలు సైతం ఏటీఎంలను ఇన్‌స్టాల్ చేస్తున్నాయి. టాటా ఇండికాష్, ముత్తూట్, ఇండియా వన్ లాంటి సంస్థలు సైతం ఏటీఎంలను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఇలా ఏటీఎం కోసం స్థలాన్ని అద్దెకు ఇచ్చి ప్రతి నెలా భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందవచ్చు.