https://oktelugu.com/

ఒక్క మెసేజ్ తో రూ.2 లక్షలు పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

ఇండియన్ ఆయిల్ లక్షాధికారి కావాలని అనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఒక్క మెసేజ్ తోనే సులువుగా 2 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే అదృష్టం ఉంటే మాత్రమే ఈ డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. డీజిల్ భో ఇనామ్ జీతో పేరుతో ఇండియన్ ఆయిల్ ఒక స్పెషల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వాళ్లకు ఇండియన్ ఆయిల్ బహుమతులను అందజేస్తుంది. 18 సంవత్సరాలకు వయస్సు పైబడిన వారు ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 8, 2021 / 08:01 AM IST
    Follow us on

    ఇండియన్ ఆయిల్ లక్షాధికారి కావాలని అనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఒక్క మెసేజ్ తోనే సులువుగా 2 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే అదృష్టం ఉంటే మాత్రమే ఈ డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. డీజిల్ భో ఇనామ్ జీతో పేరుతో ఇండియన్ ఆయిల్ ఒక స్పెషల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వాళ్లకు ఇండియన్ ఆయిల్ బహుమతులను అందజేస్తుంది.

    18 సంవత్సరాలకు వయస్సు పైబడిన వారు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకేసారి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో 25 లీటర్ల డీజిల్ ను కొనుగోలు చేయడం ద్వారా ఈ పోటీలో పాల్గొనవచ్చు. డీజిల్ ను కొనుగోలు చేసిన తర్వాత కచ్చితంగా బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లు వివరాలను మెసేజ్ చేయడం ద్వారా ఈ పోటీలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    బిల్లులో బిల్లు నెంబర్, డీలర్ కోడ్ యొక్క వివరాలు ఉంటాయి. ఆ వివరాలను మెసేజ్ చేస్తే సరిపోతుంది. 7799033333 అనే నంబర్ కు వివరాలను మెసేజ్ చేయాల్సి ఉంటుంది. మొదట డీలర్ కోడ్ ను ఎంటర్ చేసి ఆ కోడ్ కు స్పేస్ ఇచ్చి బిల్లు నంబర్ ను ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి క్వాంటిటీ ఎంటర్ చేసి పైన పేర్కొన్న నంబర్ కు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీలో విన్ అయిన నలుగురికి 2 లక్షల రూపాయల చొప్పున అందిస్తారని సమాచారం.

    ఎక్కువ మొత్తంలో డీజిల్ ను కొనుగోలు చేసేవాళ్లకు ఈ ఆఫర్ వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ ను సంప్రదించి ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.