Sbi: ఎస్బీఐ నుంచి కొత్త ఏటీఎం కార్డ్ కావాలా.. ఏం చేయాలంటే..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డెబిట్ కార్డు పొందాలని అనుకునే వాళ్లకు తీపికబురు అందించింది. ఇంట్లో నుంచే డెబిట్ కార్డును పొందే అవకాశాన్ని ఎస్బీఐ కల్పిస్తుండటం గమనార్హం. ఎస్బీఐ యోనో ద్వారా ఈ ఫెసిలిటీని పొందే అవకాశం ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు యోనో యాప్ సహాయంతో చెక్ పేమెంట్ క్యాన్సల్, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు, ఆన్‌లైన్ రీచార్జ్, ఫండ్ ట్రాన్స్‌ఫర్, అకౌంట్ స్టేట్‌మెంట్, చెక్ బుక్ […]

Written By: Navya, Updated On : August 19, 2021 10:33 am
Follow us on


దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డెబిట్ కార్డు పొందాలని అనుకునే వాళ్లకు తీపికబురు అందించింది. ఇంట్లో నుంచే డెబిట్ కార్డును పొందే అవకాశాన్ని ఎస్బీఐ కల్పిస్తుండటం గమనార్హం. ఎస్బీఐ యోనో ద్వారా ఈ ఫెసిలిటీని పొందే అవకాశం ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు యోనో యాప్ సహాయంతో చెక్ పేమెంట్ క్యాన్సల్, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు, ఆన్‌లైన్ రీచార్జ్, ఫండ్ ట్రాన్స్‌ఫర్, అకౌంట్ స్టేట్‌మెంట్, చెక్ బుక్ ఆర్డర్ సేవలను పొందవచ్చు.

ఎస్బీఐ యోనో యాప్ సహాయంతో కొత్త ఏటీఎం కార్డు కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే కొత్త డెబిట్ కార్డును పొందాలని అనుకుంటారో వాళ్లు యోనో యాప్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. అందులో సర్వీస్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ను ఎంచుకుని తర్వాత బ్లాక్ ఏటీఎం/డెబిట్ కార్డు‌పై క్లిక్ చేసి ఆ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతా పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత అకౌంట్ నంబర్ ను ఎంచుకుని కార్డు నంబర్ ను ఎంచుకుని ఖాతాను బ్లాక్ చేయడానికి గల కారణాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సులభంగా కొత్త ఏటీఎం కార్డును పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి ఎస్బీఐ యోనో యాప్ ను సులభంగానే డౌన్ లోడ్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఎస్బీఐ కస్టమర్లకు ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎస్బీఐ యోనో యాప్ ను సులభంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. దేశంలో ఎస్బీఐకి 40 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. ఎస్బీఐ కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తుండటం గమనార్హం.