https://oktelugu.com/

50 కోట్ల ‘మోసగాళ్లు’ బాలీవుడ్ లో ఎంత సాధించిందో తెలుసా..?

మంచు ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళల్లో ఒక్కరు కూడా స్టార్ అనిపించుకోలేకపోయారు. నిజానికి మంచు విష్ణు స్టార్ డమ్ కోసం చేయని ప్రయత్నం లేదు. అయినా విష్ణుకి అసలు అదృష్టం కలిసి రావడం లేదు. అయితే కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడని.. వైవిధ్యమైన సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేయగలడు అని విష్ణు మంచి పేరు తెచ్చుకున్నా, అతనికి ప్రేక్షకులు హిట్ మాత్రం ఇవ్వడం లేదు. అందుకే మంచు ఫ్యామిలీకి నిర్మాతలు కూడా దూరమైపోయారు. మంచు విష్ణు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 29, 2021 / 11:50 AM IST
    Follow us on

    మంచు ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళల్లో ఒక్కరు కూడా స్టార్ అనిపించుకోలేకపోయారు. నిజానికి మంచు విష్ణు స్టార్ డమ్ కోసం చేయని ప్రయత్నం లేదు. అయినా విష్ణుకి అసలు అదృష్టం కలిసి రావడం లేదు. అయితే కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడని.. వైవిధ్యమైన సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేయగలడు అని విష్ణు మంచి పేరు తెచ్చుకున్నా, అతనికి ప్రేక్షకులు హిట్ మాత్రం ఇవ్వడం లేదు. అందుకే మంచు ఫ్యామిలీకి నిర్మాతలు కూడా దూరమైపోయారు.

    మంచు విష్ణు ఇటీవల హాలీవుడ్ సినిమా అని చెప్పుకొని రిలీజ్ చేసిన మూవీ ‘మోసగాళ్లు’. మంచు విష్ణు, కాజల్ లు ప్రధాన పాత్రలుగా పోషించిన ‘మోసగాళ్లు’సినిమా ఇటీవల విడుదలై ఘోరమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.. తెలుగుతో పాటు హిందీ, తమిళం ఇతర భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా లెవల్లో రూ.50 కోట్లు పెట్టి సినిమా తీశారు. సునీశ్ శెట్టి, కాజల్ లాంటి భారీ తారాగణంను పెట్టి తీయడంతో దేశీయంగా బాగా ప్రచారం వచ్చింది.

    పేరుకు తెలుగు మూవీ అయినా తెలుగు కథలకు భిన్నంగా ఉండే దీనిని హాలీవుడ్ లెవ్లలో తీయడంతో హిందీ లో ఆడుతుందని నమ్మారు. అయితే ఈ సినిమా కు బాలీవుడ్లో రికార్డులను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఎన్నడూ లేనంతగా వచ్చిన వసూళ్లను చూసి సినీ ఇండస్ట్రీ షాక్ కు గురవుతోంది.

    రెండు వారాల కింద విడుదలయిన ‘మోసగాళ్లు’ థియేటర్ రైట్స్ కంటే ముందే శాటిలైట్, ఇతర డిజిటల్ మీడియా కింద రూ.30 కోట్లను సొంతం చేసుకుంది. ఆ తరువాత ఎక్కువే వస్తాయని అనుకున్నారు. అయితే సినిమా విడుదలయిన మొదటి రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. తెలుగులోనూ ఎలాగూ ఇప్పుడున్న పోటీకి తట్టుకోలేకపోయింది. అయితే హిందీలో కూడా విడుదల చేయడంతో అక్కడి వసూళ్ల కోసం ఆరాటపడ్డారు. ఈ సినిమాలో సునీల్ శెట్టి నటించడంతో ఆయన రెఫరీలు, ఇతర మార్గాల ద్వారా ఇప్పటి వరకు రూ.10.20 కోట్ల మేర వసూళ్లు వచ్చాయట.

    హిందీ డబ్ వర్షన్ లో 150 తెరలపై రిలీజ్ చేశారు. ప్రస్తుతం అక్కడ మీడియం రేంజ్ సినిమాలే కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి సమయాల్లో డబ్ సినిమా అయిన ‘మోసగాళ్లు’ను ఎవరూ పట్టించుకోలేదు.

    ఈ పరిణామాలతో మోసగాళ్లు మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. కనీసం పెట్టుబడి కూడా రికవరీ కాకపోవడంతో మూవీ యూనిట్ తీవ్ర నిరాశలో ఉంది. కాజల్, సునీశ్ శెట్టి హిందీ ప్రేక్షకులకు తెలిసిన వారైనా ఈ సినిమాను ఆదరించకపోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. రూ.50 కోట్ల సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు రావడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.