
చైనాలోని వూహన్ లో గతేడాది పుట్టిన కరోనా సంవత్సరం పాటు ప్రపంచాన్ని గడగడలాడించింది. ప్రపచంలోని అమెరికాతో సహా భారత్ లోని ప్రవేశించిన కరోనా ఇక్కడి ప్రజలకు నిద్రలేకుండా చేసింది. దేశంలో 1.1 కోట్ల మంది బాడీల్లోకి ప్రవేశించిన కరోనా 1,57,000 మంది ప్రాణాలను తీసుకుంది. అమెరికా తరువాత అత్యధికంగా నమోదైన మరణాల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లో వారి పరిస్థితులను భట్టి లాక్ డౌన్ సడలింపులు ఇవ్వగా భారత్ గతేడాది జూన్ నుంచి కొద్ది కొద్దిగా సడలిలింపులు ఇస్తూ సెప్టెంబర్ నాటికి పరోక్షంగా ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది.
భారత్ లో కరోనా విజృంభణ అత్యథిక వేగంగా విస్తరించింది. మిగతా దేశాల్లోకంటే ఇక్కడి జనసాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల వైరస్ వ్యాప్తి చాలా వేగంగా సాగింది. ఈ నేపథ్యంలో భారత్ మిగతా దేశాల కంటే ముందుగానే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అంతకుముందే అమెరికా, రష్యా లాంటి దేశాలు కరోనా వ్యాక్సిన్ తయారు చేసి కొందరికి వ్యాక్సినేషన్ చేశారు. కానీ భారత్ లో అత్యధికంగా వ్యాక్సినేషన్ జరగడం విశేషం.
కరోనా వ్యాక్సినేషన్ ఈ ఏడాది జనవరి 16న ప్రారంభించారు. మొట్టమొదటి టీకాను ఓ పారశుధ్య కార్మికుడికి ఇచ్చారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా వేయడం ప్రారంభించారు. ఇందులో మొదట పారిశుధ్య కార్మికులకు, వైద్య సిబ్బందికి ఆ తరువాత పోలీసులకు వ్యాక్సినేషన్ ఇచ్చారు. వీరికి రెండో దఫా టీకా కార్యక్రమం కూడా పూర్తయింది. ఇక మార్చి 1 నుంచి 60 ఏళ్ల లోపు వృద్ధులకు టీకా ఇస్తున్నారు. 45 నుంచి 59 ఏళ్ల వయసు వారికి టీకా ఇస్తున్నారు.
మార్చి 10 వరకు ఉన్న లెక్కల ప్రకారం దేశంలో 2 కోట్ల మంది టీకాలు తీసుకున్ారు. జూలై చివరి నాటికి 25 కోట్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పేదలు, సామాన్యులు మాత్రం టీకా వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. వారిలో ప్రభుత్వం మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్యులు. మిగతా రాష్ట్రాల్లో కంటే కేరళలో టీకా ఎక్కువ మంది వేసుకున్నారు.
భారత్ లో రెండు రకాల టీకాలను ఉపయోగిస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కోవాగ్జిన్, భారత్ బయోటిక్ టీకాలను ప్రజలకు వేస్తుున్నారు. మార్చి 1న ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోవాగ్జిన్ టీకా వేసుకున్నారు. అయితే ఓ వైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.