https://oktelugu.com/

ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య.. ప్రకటన తేది ఇదే

తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఫాలో అవుతూ చరిత్రలో తాను నిలిచిపోయే పనులకు ఏపీ సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 26 జిల్లాలను చేసేందుకు ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఎంపీ స్థానాలు 25 కాగా.. అరకు పార్లమెంట్ పెద్దది కావడంతో అందులో పాడేరును కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఆ జిల్లాలు పెరుగుతాయా? తరుగుతాయా? కొత్తవి ఏమైనా యాడ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 10:04 am
    Follow us on

    తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఫాలో అవుతూ చరిత్రలో తాను నిలిచిపోయే పనులకు ఏపీ సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ను పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 26 జిల్లాలను చేసేందుకు ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఎంపీ స్థానాలు 25 కాగా.. అరకు పార్లమెంట్ పెద్దది కావడంతో అందులో పాడేరును కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఆ జిల్లాలు పెరుగుతాయా? తరుగుతాయా? కొత్తవి ఏమైనా యాడ్ అవుతాయా? అన్నది తెలియాల్సి ఉంది.

    పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాల వ్యవహారంలో వైసీపీ నేతలెవరూ తలదూర్చవద్దని సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరికలు పంపారు. దీంతో ఈ వ్యవహారంలో వైసీపీ సర్కార్ గుట్టుచప్పుడు కాకుండా పని పూర్తి చేసినట్టు సమాచారం.

    వచ్చే ఏడాదిలో ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం నియమించిన కమిటీల నివేదికల ఆధారంగా కొత్త జిల్లా ప్రకటన ఉంటుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తాజాగా సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త జిల్లాల ప్రకటన ఉండబోతోందని డిప్యూటీ స్పీకర్ గుంటూరులో తెలిపారు.

    ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి వస్తోందని.. పార్లమెంట్ నియోజకవర్గాలకు అదనంగా అతిపెద్దదైన అరకు నియోజకవర్గాన్ని కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తున్నామని కోన రఘుపతి తెలిపారు. జిల్లాల సరిహద్దులతోపాటు ఇతర అంశాలపై అధికారులు నిర్ణయం తీసుకుటున్నారని రఘుపతి వివరించారు.

    ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు దాదాపు ఫీల్డ్ వర్క్ పూర్తయినట్టు తెలిసింది.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు ముగింపు దశకు చేరిందట.. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ ఈ మేరకు తుది జిల్లాల ప్రకటనకు రెడీ అయినట్టు సమాచారం.. 26 జిల్లాలు (అరకును రెండు జిల్లాలుగా మార్చి పాడేరును కొత్త జిల్లాగా అదనంగా ఏర్పాటు చేస్తున్నారు). జనవరి 26న కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.