https://oktelugu.com/

జగన్‌ సైలెంట్‌ అయినా.. కయ్యానికి టీడీపీ తహతహ

ఏపీ సీఎం జగన్‌ ఏదేని విషయం గురించి పెద్దగా ఆలోచించరు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా.. వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్నా పెద్దగా లెక్క చేయరు. ఇటీవల ఓ సుప్రీం కోర్టు జడ్జిపై జగన్‌ రాసిన లేఖనే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. న్యాయవ్యవస్థలు జరుగుతున్న అన్యాయంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దానికి సంబంధించి పలు ఆధారాలను కూడా జత చేశారు. కానీ.. ఆ విషయాన్ని అంతటితో జగన్‌ మరిచిపోయారు. ఫిర్యాదు అయితే చేశాం.. ఏం చర్యలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 10:29 am
    Follow us on

    chandrababu jagan

    chandrababu jagan

    ఏపీ సీఎం జగన్‌ ఏదేని విషయం గురించి పెద్దగా ఆలోచించరు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా.. వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్నా పెద్దగా లెక్క చేయరు. ఇటీవల ఓ సుప్రీం కోర్టు జడ్జిపై జగన్‌ రాసిన లేఖనే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. న్యాయవ్యవస్థలు జరుగుతున్న అన్యాయంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దానికి సంబంధించి పలు ఆధారాలను కూడా జత చేశారు. కానీ.. ఆ విషయాన్ని అంతటితో జగన్‌ మరిచిపోయారు. ఫిర్యాదు అయితే చేశాం.. ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాంలే అన్నట్లే ఉన్నారు.

    Also Read: ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య.. ప్రకటన తేది ఇదే

    కానీ.. దీనిపై టీడీపీ అనుకూల‌, సానుకూల వ‌ర్గాలు.. ముఖ్యంగా ఓ సామాజిక వ‌ర్గం నుంచి ఎదురుదాడి జరుగుతూనే ఉంది. అయినా జగన్‌ మాత్రం ఎలాంటి ప్రతి దాడులకు వెళ్లడం లేదు. అంతేకాదు, వైసీపీ నాయ‌కుల‌ను కూడా ఈ విష‌యంపై ఎవ‌రూ మాట్లాడ‌వ‌ద్దని ఆదేశాలు జారీ చేశారు. త‌న సొంత మీడియాలో మాత్రం అనుకూల సానుకూల మేధావుల నుంచి అభిప్రాయాల‌ను వెల్లడిస్తోంది. సైలెంట్‌గా ఉంటూనే విజయం సాధించాలని చూస్తున్నారు జగన్‌. ఏం జ‌రిగినా త‌న మంచికే అనుకుంటున్నారు. కానీ, ఇదే విష‌యంపై ప్రతిపక్ష చంద్రబాబు మాత్రం కుమిలిపోతున్నార‌ట. ఆయ‌న నిత్యం ఇదే విష‌యంపై ఆలోచిస్తున్నార‌ని వారు చెబుతున్నారు.

    టీడీపీలోని ఓ సీనియర్‌‌ నాయకుడు స్పందిస్తూ.. ‘మా నాయ‌కుడికి ఆలోచ‌న‌తోపాటు భ‌యం కూడా ఉంది. గ‌తంలో ఓటుకు నోటు కేసులో త‌న పేరు రాగానే వెంట‌నే మీడియా మీటింగ్ పెట్టి.. వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగారు. కానీ, ఇప్పుడు ఆ ఛాన్స్ లేక‌పోవ‌డం.. పైగా నేరుగా త‌న‌కు సంబంధించిన వ్యక్తుల‌తో ఈ విష‌యంపై మాట్లాడితే.. ఇంటలిజెన్స్ నిఘా వ‌ర్గాలు ప‌సిగ‌డ‌తాయేమోన‌ని కూడా చంద్రబాబు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది’ అని అంటున్నారు. ‘ఇప్పుడు మా బాబైనా.. మేమైనా చేయ‌గ‌లిగింది ఏమీ లేదు. జ‌ర‌గాల్సింది జ‌రుగుతుంది. మేం ప‌నిగ‌ట్టుకుని మాట్లాడినా.. బాబును వెనుకేసుకువ‌చ్చినా.. లాభం లేదు.. సో.. ఇప్పుడు బాబు దీనిపై మౌనంగా ఉండ‌డం బెట‌ర్’ అని సూచ‌న‌లు చేశారు. మ‌రి బాబు ఎలా తీసుకుంటారో ? చూడాలి.

    Also Read: టీడీపీ వస్తే రైతుకు రూ. 1.15 లక్షలు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..?

    ఇదంతా ఇలా ఉంటే.. చంద్రబాబుపై సానుభూతి ఉన్న ఆయన సామాజిక వర్గం కూడా జగన్‌పై ఎదురుదాడికి దిగుతోంది. జగన్‌ను విలన్‌ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. దీనికి కొంద‌రు బీజేపీలోకి వెళ్లిన టీడీపీ మాజీ నేత‌లు కూడా స‌హ‌క‌రిస్తున్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ఏది ఏమైనా.. జగన్‌ మరిచిపోయిన విషయాలను ప్రతిపక్ష టీడీపీ, దాని అనుకూరులు మాత్రం రోజూ గుర్తుచేసే పనిలోనే ఉండిపోయింది.