ప్రజలకు అలర్ట్.. ఏప్రిల్ లో బ్యాంకు సెలవులు ఇవే..?

తరచూ బ్యాంకులలో లావాదేవీలు చేసేవాళ్లు ప్రతి నెలా సెలవుల గురించి కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఏప్రిల్ నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకు సెలవులుగా ఉండగా కేవలం 18 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. సగం కంటే కొంచెం ఎక్కువ రోజులు మాత్రమే బ్యాంకులు పని చేస్తున్న నేపథ్యంలో సెలవులపై కచ్చితంగా అవగాహనను కలిగి ఉంటే మంచిది. తరచూ లావాదేవీలు చేసేవాళ్లు ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది. Also Read: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. […]

Written By: Kusuma Aggunna, Updated On : March 24, 2021 11:06 am
Follow us on

తరచూ బ్యాంకులలో లావాదేవీలు చేసేవాళ్లు ప్రతి నెలా సెలవుల గురించి కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఏప్రిల్ నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకు సెలవులుగా ఉండగా కేవలం 18 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. సగం కంటే కొంచెం ఎక్కువ రోజులు మాత్రమే బ్యాంకులు పని చేస్తున్న నేపథ్యంలో సెలవులపై కచ్చితంగా అవగాహనను కలిగి ఉంటే మంచిది. తరచూ లావాదేవీలు చేసేవాళ్లు ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది.

Also Read: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. మార్చిలో సెలవులు ఎన్నిరోజులంటే..?

మార్చి 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ బ్యాంకుల అకౌంటింగ్ వల్ల సెలవు దినంగా ఉంటుంది. ఏప్రిల్ 2వ తేదీన గుడ్ ఫ్రైడే కాగా ఆరోజు కూడా సెలవు దినం కావడం గమనార్హం. ఏప్రిల్ 4వ తేదీ తొలి ఆదివారం కాగా ఏప్రిల్ 5వ తేదీన బాబూ జగ్జీవన్ రామ్ జయంతిగా ఉంటుంది. ఏప్రిల్ 10వ తేదీన రెండో శనివారం కాగా ఏప్రిల్ 11వ తేదీన ఆదివారం కావడం వల్ల సెలవు దినంగా ఉంది.

Also Read: మెరుపు తగ్గుతున్న బంగారం.. ధరలు ఎందుకు పడిపోతున్నాయో తెలుసా?

ఏప్రిల్ 13వ తేదీన ఉగాది పండుగ కావడంతో ఆరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సెలవు దినంగా ఉంది. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి కాగా ఏప్రిల్ 18వ తేదీ ఆదివారంగా ఉంది. ఏప్రిల్ 21వ తేదీన శ్రీరామనవమి పండుగ కాగా ఏప్రిల్ 24వ తేదీ నాలుగో శనివారంగా ఉంది. ఏప్రిల్ 25వ తేదీ ఆదివారం కావడంతో ఆరోజు కూడా సెలవు దినంగా ఉంది. ఇలా మొత్తం 12 రోజులు సెలవు దినాలుగా ఉన్నాయి.

ఈ సెలవులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలవులు కాగా రాష్ట్రాల ప్రాతిపదికన సెలవులలో స్వల్పంగా మార్పులు ఉంటాయి. ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా సెలవులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.