అఖిలప్రియ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. : కీ రోల్‌ ఆమెదేనట..!

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సెన్సేషనల్‌ అయింది. ఏకంగా ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి హస్తం ఉండడం మరింత చర్చకు దారితీసింది. ఇప్పుడు ఆ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీలుగా ఉన్న బోయ సంపత్ కుమార్, మల్లికార్జునరెడ్డి తాజా పోలీస్ విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ ఉదంతం మొత్తం అఖిలప్రియ డైరెక్షన్‌లోనే జరిగిందని నిందితులు పోలీసులతో […]

Written By: Srinivas, Updated On : January 21, 2021 10:56 am
Follow us on


బోయిన్‌పల్లి కిడ్నాప్‌ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సెన్సేషనల్‌ అయింది. ఏకంగా ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి హస్తం ఉండడం మరింత చర్చకు దారితీసింది. ఇప్పుడు ఆ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీలుగా ఉన్న బోయ సంపత్ కుమార్, మల్లికార్జునరెడ్డి తాజా పోలీస్ విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ ఉదంతం మొత్తం అఖిలప్రియ డైరెక్షన్‌లోనే జరిగిందని నిందితులు పోలీసులతో చెప్పినట్లు సమాచారం.

Also Read: త్వరలోనే విశాఖకు రాజధాని తరలింపు..: ఆ మంత్రులు చెప్పేశారుగా..

అంతేకాదు.. సిమ్ కార్డుల కొనుగోలు, విజయవాడ నుంచి వచ్చిన గ్యాంగ్‌కి లాడ్జి గదులు బుక్ చేయడం.. ఇవన్నీ కూడా అఖిలప్రియ ఆదేశాల మేరకే చేశామని నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టయిన బోయ సంపత్ కుమార్, మల్లికార్జునరెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కోర్టు అనుమతితో పోలీసులు బుధవారం వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. కిడ్నాప్ ఉదంతంలో అఖిలప్రియే కీలక సూత్రధారి అని వీరు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ‘అఖిలప్రియ ఆదేశాలతోనే అన్నీ చేశాం.. సిమ్ కార్డులు కొన్నాం.. గుంటూరు శ్రీను స్నేహితులమంటూ విజయవాడ నుంచి వచ్చిన గ్యాంగ్‌కి కూకట్‌పల్లిలో లాడ్జి గదులు బుక్ చేశాం’ అని పోలీసులతో నిందితులు చెప్పినట్లు సమాచారం.

అఖిలప్రియ ఆదేశాల మేరకే చెన్నయ్యతో కలిసి బోయినపల్లిలోని ప్రవీణ్ రావు ఇంటి వద్ద నాలుగైదు సార్లు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కిడ్నాప్ చేసిన తీరును తెలుసుకునేందుకు గురువారం పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందట. ఇందుకోసం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లనున్నారు. ప్రవీణ్ రావు ఇంట్లోకి ఎలా చొరబడ్డారు.. బలవంతంగా కారులో కూర్చోబెట్టి ఎలా అక్కడి నుంచి తరలించారు.. ఏయే చోట్ల వారిని కారులో తిప్పారు.. డాక్యుమెంట్స్‌పై సంతకాలు తీసుకునే సమయంలో వారిని ఎలా బెదిరించారు తదితర అంశాలపై పోలీసులు నిందితులను ప్రశ్నించే అవకాశం ఉంది.

Also Read: ఆ బాధ్యతను ఎల్లో మీడియా భుజానా వేసుకుందా..?

ఇదిలా ఉండగా.. అఖిలప్రియ బెయిల్‌ వ్యవహారం కూడా నేడు తేలనుంది. సికింద్రాబాద్‌ సెషన్‌ కోర్టులో బుధవారం బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా.. కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. దీంతో అఖిలప్రియ బెయిల్‌పై సస్పెన్స్ వీడలేదు. ఇప్పటికే రెండుసార్లు అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో తాజా పిటిషన్‌పై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి. అఖిలప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరింపులకు గురిచేసే అవకాశం ఉందన్న పోలీసుల వాదనతో ఏకీభవిస్తూ గతంలో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయలేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్