తిరుపతి ఉప ఎన్నికకు ముందే కర్నూలుకు హైకోర్టు?

సీఎం జగన్ ఢిల్లీ టూర్ తర్వాత ఆసక్తి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చడానికి సంబంధించి ప్రక్రియ వేగంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక కంటే ముందే దీనికి సంబంధించి విధి విధానాలను పూర్తి చేసి కర్నూలుకు హైకోర్టును తరలించబోతున్నారని తెలుస్తోంది. Also Read: ఇదేం డీపీఆర్‌‌..: ఏపీకి ‘జల’క్‌ ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. న్యాయశాఖ మంత్రి కార్యాలయంలో క్లియరెన్స్ తర్వాత రాష్ట్ర పతి ఉత్తర్వులు జారీ […]

Written By: NARESH, Updated On : December 18, 2020 8:24 pm
Follow us on

సీఎం జగన్ ఢిల్లీ టూర్ తర్వాత ఆసక్తి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చడానికి సంబంధించి ప్రక్రియ వేగంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక కంటే ముందే దీనికి సంబంధించి విధి విధానాలను పూర్తి చేసి కర్నూలుకు హైకోర్టును తరలించబోతున్నారని తెలుస్తోంది.

Also Read: ఇదేం డీపీఆర్‌‌..: ఏపీకి ‘జల’క్‌

ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. న్యాయశాఖ మంత్రి కార్యాలయంలో క్లియరెన్స్ తర్వాత రాష్ట్ర పతి ఉత్తర్వులు జారీ చేస్తారని.. ఇదంతా తిరుపతి ఉప ఎన్నిక ముందే పూర్తవుతుందని సమాచారం. ఈ విధానం పూర్తయితే హైకోర్టు బదిలీ ప్రక్రియ ఏపీ ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా మార్చాలో అంత త్వరగా చేయడానికి వీలవుతుంది. వచ్చే ఫిబ్రవరిలోపే కర్నూలులో ఏపీ హైకోర్టు కొలువుదీరుతుందని చెబుతున్నారు.

నిజానికి ఇది బీజేపీకి లాభం చేకూర్చే నిర్ణయమని చెబుతున్నారు. హైకోర్టును రాయలసీమకు తామే తీసుకొచ్చామని తిరుపతి ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి బీజేపీ ప్రధాన అస్త్రం దొరుకుతుందని భావిస్తున్నారు. అయితే ఎవ్వరూ చేసినా ఈ ప్రక్రియలో అధికార వైసీపీకి కూడా ఖచ్చితంగా ప్రయోజనం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: దివీస్‌ విషయంలో టీడీపీ, వైసీపీ యూటర్న్‌

హైకోర్టు కర్నూలుకు వస్తే టీడీపీకి దెబ్బ పడుతుంది. ఎందుకంటే ఆ పార్టీ మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతికే కట్టుబడింది. దీంతో టీడీపీ ఓటు బ్యాంకు ఖచ్చితంగా బీజేపీకి లేదా వైసీపీకి మరలే చాన్స్ కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్