ట్విట్టర్ లో చెలరేగిపోతున్న పవన్ పై హ్యాష్ టాగ్!

పవర్ స్టార్.. ఈ సౌండ్‌కి కొంత మందిలో పూనకం వస్తుంది. “పవన్ కళ్యాణ్ “ఈ పేరు వింటే కొంత మంది రక్తం ఉరకలేస్తుంది. జనసేనాని.. ఈ పేరు చెబితే కొన్ని లక్షల పిడికిళ్లు పైకి లేస్తాయి. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. సినిమా ఒక్కటే ప్రపంచం కాదు, ప్రజా సేవలేని జీవితం దండగ అని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలో విజయాన్ని అందుకోలేకపోయినా.. సేవకు కొలమానం […]

Written By: Neelambaram, Updated On : July 16, 2020 3:42 pm
Follow us on

పవర్ స్టార్.. ఈ సౌండ్‌కి కొంత మందిలో పూనకం వస్తుంది. “పవన్ కళ్యాణ్ “ఈ పేరు వింటే కొంత మంది రక్తం ఉరకలేస్తుంది. జనసేనాని.. ఈ పేరు చెబితే కొన్ని లక్షల పిడికిళ్లు పైకి లేస్తాయి. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. సినిమా ఒక్కటే ప్రపంచం కాదు, ప్రజా సేవలేని జీవితం దండగ అని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలో విజయాన్ని అందుకోలేకపోయినా.. సేవకు కొలమానం ప్రజలు వేసే ఓట్లు కాదు అని జనసైనికుల్లో స్ఫూర్తిని నింపుతూ ముందుకెళ్తున్నారు. ప్రజల్లో మమేకమవుతున్నారు.

అన్నయ్య చిరంజీవి లాగే రాజకీయాల్లో అడుగుపెట్టి జనసేన పార్టీ స్థాపించి పాలిటిక్స్‌ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొన్నటి వరకు ఎన్నికల హడావుడి దృష్ట్యా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇపుడు మళ్లీ సినిమాల వైపు దృష్టి సారించారు. ఈ కోవలోనే హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. అంతేకాదు క్రిష్, హరీష్ శంకర్‌‌ తో పాటు పలువురు దర్శకులతో సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. దానికి నెలన్నరకు పైగా సమయం ఉంది. ఈ లోగా పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఇప్పటి నుంచే సందడి చేయడం మొదలు పెట్టారు. హ్యాపీ బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ ను క్రియేట్ చేసి ట్విట్టర్‌ లో ట్రెండ్ చేసారు. కేవలం 24 గంటల్లోనే 27.3 మిలియన్ ట్వీట్స్ వచ్చాయంటే పవన్ కళ్యాణ్ ఏ రేంజ్‌ లో చెలరేగిపోయారో సెపరేట్‌ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ హడావుడి పవన్ బర్త్ డే వరకు కొనసాగుతుందని పవన్ అభిమానులు స్పష్టం చేశారు.